Viswak Sen : ఎంత పెద్ద మాట సర్ అది

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ హీరోస్ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రొటీన్ రొట్ట సినిమాలు చేసిన హీరోలు అందరూ షెడ్డు కి పోతున్నారు. డిఫరెన్స్ కాన్సెప్ట్ ఎన్నుకున్నవాళ్లే నేటికీ నిలబడి ఉన్నారు అనేది వాస్తవం.

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో నిఖిల్ ఒకడు. నిఖిల్ ఈ మధ్యన ఎంచుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటున్నాయి అని చెప్పొచ్చు. రీసెంట్ గా కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు నిఖిల్. ఆ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 18 పేజీస్ సినిమాలో కనిపించాడు నిఖిల్. 18 పేజీస్ సినిమా కూడా చాలామందిని ఆకట్టుకుంది. ఈ లవ్ స్టోరీ చాలామందికి ఫేవరెట్ ఫిల్మ్ అని కూడా చెప్పొచ్చు.

ఆ తర్వాత నిఖిల్ స్పై అనే ఒక సినిమాను చేశాడు. కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ సినిమా విషయంలో నిర్మాతతో కొద్దిపాటి అభిప్రాయ బేధాలు కూడా నిఖిల్ కి వచ్చాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో వీళ్ళిద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ మిగతా యంగ్ హీరోస్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ను కొనసాగిస్తాడు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ క్రికెట్ మ్యాచెస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీసీఎల్ మ్యాచ్ లో భాగంగా గామీ చిత్ర యూనిట్ విశ్వక్సేన్ మరియు చాందిని చౌదరి సీసీఎల్ ను వీక్షించటానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వీరిద్దరూ నిఖిల్ ని కలిశారు.

వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు నిఖిల్ ఒక వీడియోని చేశాడు. ఎక్స్పెషల్లీ ఈ ట్రైలర్ చాలా బాగుంది అని చెప్తున్న తరుణంలో వీరిద్దరూ నా బ్యాటింగ్ చూడటం కోసమే వచ్చారు అన్నాడు నిఖిల్. అయితే నిఖిల్ అప్పటికే క్రికెట్ డ్రెస్ లో ఉండి క్రీజ్ లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ తరుణంలో విశ్వక్సేన్ అదే వీడియోలో మాట్లాడుతూ నీ బ్యాటింగ్ కి ఫలితం కూడా మొన్ననే వచ్చింది. ఒక అబ్బాయి కూడా పుట్టాడు అంటూ వెనకనుంచి మాట్లాడుతూ వచ్చాడు.

అయితే దీనికి కొందరు కామెడీగా తీసుకున్న కూడా, ఇంకొందరు సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఏంటి అలా మాట్లాడటం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించడం అనేది మంచిది.అయితే ఈ విషయాన్ని నిఖిల్ పెద్దగా పట్టించుకోకుండా క్యాజువల్ గా తీసుకున్నాడు. అలానే చాలామంది నిఖిల్ ని ఆ గెటప్ లో చూసి బాగా మెచ్చుకుంటున్నారు. నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం లాంగ్ హెయిర్ ని తన గడ్డాన్ని పెంచుతున్నాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు