Gaami: సినిమా తేడా కొడితే ఈ పాయింట్ తోనే ట్రోల్ చేస్తారు

క్రిస్టోఫర్ నొలన్ , అమెరికాకు చెందిన టాప్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ప్రొడ్యూసర్. నొలన్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు హాలివుడ్లో భారీ వసూళ్ళతొ పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇతను తరచూ తన సొదరుడు అయిన జానథన్ నొలన్తో కలిసి చిత్రాలు నిర్మిస్తుంటాడు. నొలన్ దర్శకత్వం వహించిన తొలి 8 చిత్రాలు $3.5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ ను వసూలు చేశాయి. నొలన్ చేసిన ఇంటర్ స్టెల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో పాటు సినీ విమర్శకలు, శాస్త్రవేత్తల ప్రశంసలు పొందింది.

ఇలా క్రిస్టోఫర్ నొలన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తను తీసేవి కేవలం సినిమాలు మాత్రమే కాదు. తను తీసేవి అద్భుతాలు అని చెప్పొచ్చు. అంతటి దర్శకుడి స్థాయితో ఒక తెలుగు సినిమాని పోల్చడం అనేది మామూలు విషయం కాదు. కానీ అదే చేశాడు ఒక యంగ్ హీరో, అతను మరెవరు కాదు విశ్వక్సేన్. విశ్వక్సేన్ గత ఆరేళ్లుగా నటిస్తున్న సినిమా గామీ.
ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మరియు ట్రైలర్ కూడా అంచనాలను రెట్టింపు చేసింది.

ఈ సినిమా గురించి విశ్వక్సేన్ మాట్లాడుతూ ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే “డన్ కిర్క్” లా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్. డన్ కిర్క్ అనేది 2017 ఎపిక్ హిస్టారికల్ వార్ థ్రిల్లర్ చిత్రం, ఇది క్రిస్టోఫర్ నోలన్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా. క్రిస్టోఫర్ దీనికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇది భూమి, సముద్రం మరియు గాలి యొక్క దృక్కోణాల నుండి రెండవ ప్రపంచ యుద్ధం యొక్క డంకిర్క్ తరలింపును చెప్తూ వస్తుంది.

- Advertisement -

గామి సినిమాను చూసినప్పుడు క్రిస్టోఫర్ నోలన్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్. అయితే విశ్వక్సేన్ మాటలతో చాలామంది ఏకీభవిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఏకిపారేస్తున్నారు. అంటే గామి టీజర్ అండ్ ట్రైలర్ చూడటానికి అద్భుతంగా ఉన్నాయి. ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ కూడా మంచి సప్రైజింగ్ లా అనిపిస్తున్నాయి. అలానే గామి పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే కేవలం విజువల్స్ చూసి సినిమాని జడ్జ్ చేయలేం. దానికి సరిపడా కథ, కథనం కూడా విజువల్స్ కి తోడవుతూ ఉండాలి.

ముందుగానే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినప్పుడు ఒక సినిమా అద్భుతమైన అనుభూతినిస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఒకవేళ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వెళ్లిన తర్వాత తీరా ఆ ఎక్స్పెక్టేషన్స్ అందుకోకపోతే నిరాశ మిగులుతుంది. ఆ నిరాశ నుంచి ఆ సినిమా యొక్క ఓటమి మొదలవుతుంది. సో విశ్వక్సేన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్, సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా ట్రోల్ కి గురవుతుంది. ఈ సినిమా మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు