Prabhas: హను మాస్టర్ ప్లాన్

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు హను రాఘవపూడి. హను రాఘవపూడి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హను చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచాయి. రీసెంట్ గా దుల్కర్ ను హీరోగా పెట్టి చేసిన సీతారామం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి హను కి మంచి రెస్పెక్ట్ ని తీసుకొచ్చి పెట్టింది.

బేసిగ్గా చాలా లవ్ స్టోరీ లన్నీ తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోని ఎక్కువగా వచ్చాయి. అవి తెలుగులో డబ్బింగ్ అయినప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా మంచి మంచి లవ్ స్టోరీలు వచ్చాయి. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి లవ్ స్టోరీస్ ను తెరకెక్కించే దర్శకుడు లేడు అనుకునే తరుణంలో హను నేనున్నాను అంటూ సెన్సిటివ్ లవ్ స్టోరీస్ ని చాలా పొయిటిక్ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు.

హను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలలో “లై” సినిమా మినహాయిస్తే మిగతావన్నీ లవ్ స్టోరీస్. హను రాఘవపూడి కి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా హను సినిమాల్లో మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అలానే హీరోయిన్ ఎంచుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్ అని కూడా అను చాలా అందంగా అద్భుతంగా చూపిస్తాడు.

- Advertisement -

రీసెంట్ గా సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి, ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా వార్ బాక్డ్రప్ లో జరగనుంది. అయితే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుపుకుంటుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఒకటి బయట వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ప్రభాస్ సరసన హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందట. వరల్డ్ వార్ స్టోరీ కావడంతో ఇంగ్లీష్ అమ్మాయికి చిత్ర యూనిట్ ప్రధాన్యత ఇస్తుందని టాక్.

అయితే ప్రభాస్ కెరియర్ లో ఒక లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రాధే శ్యామ్ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ రాధే శ్యామ్ లో పాటలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలను విన్న చాలా మంది ఒక ఎపిక్ లవ్ స్టోరీని చూడబోతున్నామంటూ ఎన్నో అంచనాలతో థియేటర్ వద్దకు వచ్చారు. కానీ ఆ అంచనాలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. హను కి ఉన్న ప్లస్ పాయింట్ లవ్ స్టోరీస్ ని బాగా డీల్ చేయటం. అది ఈ సినిమాలో ఎక్కడైనా వర్కౌట్ చేస్తే ప్రభాస్ కెరియర్ లో ఒక గ్రేట్ లవ్ స్టోరీ మనం చూడడానికి ఆస్కారం ఉంటుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు