Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ పవర్ ప్యాకెడ్ లైనప్

2002లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ కి వర్షం సినిమాతో మంచి గుర్తింపు లభించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో మంచి స్టార్ డం వచ్చింది. ఆ తర్వాత చేసిన యోగి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలు ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేశాయి. మిర్చి సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ఇటు కమర్షియల్ గా మాస్ ప్రేక్షకులు కూడా ఆకట్టుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అని చెప్పొచ్చు. కేవలం ప్రభాస్ కెరియర్ మాత్రమే కాదు తెలుగు సినిమా చరిత్ర కూడా బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే చెప్పే రేంజ్ కి ఎదిగింది. ఎందుకంటే బాహుబలి సినిమా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది. తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. అప్పటినుండి ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూడటం మొదలుపెట్టారు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా మళ్లీ అద్భుతమైన కలెక్షన్ తీసుకొచ్చి ప్రభాస్ ను ఫామ్ లో నిలబెట్టింది. ఇకపోతే ప్రభాస్ నెక్స్ట్ లైనప్ మాత్రం మామూలుగా లేదు అని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుందని చాలామంది ఊహిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా రాజా సాబ్. ఎప్పటినుంచో ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మిస్ అవుతున్న ప్రేక్షకులకు ఈ సినిమాతో పక్క ఎంటర్టైన్మెంట్ దొరకబోతుందని చాలామంది నమ్మకం. ఎందుకంటే దర్శకుడు మారుతి కాబట్టి.

ఈ సినిమా తర్వాత యంగ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో హను రాఘవపూడి తో చేయాల్సిన సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్స్ స్థాయిలో ఉంది. అందుకే ఈ 2024 లోనే సలార్ పార్ట్ 2 లో కూడా ప్రభాస్ పాల్గొనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బాహుబలి తర్వాత కొన్ని సినిమాలు నిరాశపరిచిన కూడా రాబోయే సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తాయని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు