Rashmika : తలపతి, సేతుపతి, దేవరకొండ.?

రష్మిక మందన్న, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఛలో సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ బ్యూటీ. అయితే మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా కూడా రష్మికకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం పుష్ప అని చెప్పొచ్చు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన చాలామందికి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. సుకుమార్ శ్రీవల్లి పాత్రను డిజైన్ చేసిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.

పుష్ప సినిమాలో రష్మిక నటించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. మంచి స్కోపున్న పాత్రను చేసి తనేంటో ప్రూవ్ చేసుకుంది. అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరో సరసన సరిలేరు నీకెవ్వరు వంటి సినిమా కూడా చేసి మంచి పేరు సాధించుకుంది. ఇకపోతే రష్మిక కి అన్నిటికంటే ఎక్కువ పేరు తీసుకొచ్చిన సినిమా మాత్రం అనిమల్ అని చెప్పొచ్చు. అనిమల్ సినిమాల్లో రష్మిక ఇచ్చిన పర్ఫామెన్స్ వేరే లెవెల్. రష్మికలో ఈ లెవెల్ పర్ఫార్మర్ ఉంది అని ప్రూవ్ చేసిన సినిమా అనిమల్.

ఇకపోతే తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి గురించి చాలా కథనాలు కూడా వచ్చాయి. ఇకపోతే వీరు ఏర్పోర్ట్ లో చాలాసార్లు కనిపించడం. ఒకే లొకేషన్ లో ఇద్దరు ఫోటోలు వేరువేరుగా కనిపించడం. విజయ్ ఇంటి దగ్గర రష్మిక ఫోటోలు కనిపించడం. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరు కూడా లవ్ లో ఉన్నారని త్వరలోనే వీరి లవ్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి.

- Advertisement -

ఇకపోతే ఈ తరుణంలో ఎనిమీ అవార్డ్స్ కి హాజరైన రష్మిక మందన్నకి ఒక క్వశ్చన్ ఎదురైంది. విజయ్ కి మీకు మధ్య ఏదో ఉంది అని ఒక యాంకర్ అడిగినప్పుడు. తలపతి విజయ్ , విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండ వీరిలో ఎవరు అన్నట్లు క్వశ్చన్ చేసింది రష్మిక. దేవరకొండ అని చెప్పగానే దేవరకొండ నేను కలిసి సినిమా చేసి చాలా రోజులైంది. ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చేయబోతున్నాము. మా కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇకపోతే రష్మిక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉంది.

ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయి సంచలనం సృష్టించింది అనిమల్ సినిమా. ఈ అనిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహాలో ప్రచారమయ్యే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్లుగా హాజరయ్యారు రష్మిక, సందీప్ రెడ్డి వంగ అండ్ రన్బీర్ కపూర్. అయితే ఈ షోలో రన్బీర్ కపూర్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో సందీప్ రెడ్డివంగా ఫోన్ తో విజయ్ దేవరకొండ కి ఫోన్ చేయటం. ఆ ఫోన్ కాల్ విజయ్ దేవరకొండ లిఫ్ట్ చేయకపోవడం. దానితో రన్బీర్ కపూర్… సర్ రష్మిక ఫోన్ తో ఫోన్ చేయండి లిఫ్ట్ చేస్తారు అని చెప్పడం. రష్మిక ఫోన్ తో ఫోన్ చేయగానే దేవరకొండ మాట్లాడిన విధానంతో చాలామందికి వీరు లవ్ లో ఉన్నారని ఒక క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు