Pallavi Prashanth: మాట నిలబెట్టుకుంటానంటున్న రైతుబిడ్డ.. డబ్బుతో..!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈసారి చాలా రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ఒక కామన్ మాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పల్లవి ప్రశాంత్ కి రైతుబిడ్డ అనే ట్యాగ్ కూడా బాగా కలిసి వచ్చింది.. వీటికి తోడు పల్లవి ప్రశాంత్ తన ఆటతీరుతో అభిమానులను బాగా ఆకట్టుకున్నారు.. అటు ఫిజికల్ టాస్క్ ల్లో కూడా పల్లవి ప్రశాంత్ బాగా చురుకుగా ఆడేవారు.. నటుడు శివాజీ ప్రోత్సాహంతో.. తన టాలెంట్ తో టైటిల్ విన్నర్ గా నిలిచానని తెలియజేశారు పల్లవి ప్రశాంత్.

ఒకవేళ టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ ఏం చేస్తారంటూ నాగార్జున అడగగా.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ కూడా తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటామంటూ తెలిపారు.. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం పేద రైతులకు పంచి పెడతానంటూ మాట ఇచ్చారు. ఈ విషయం కూడా జనాలకు తనపై బాగా అభిమానం కలిగించేలా చేసింది. ఈ ఒక్క మాట వల్ల ఫైనల్లో అమర్దీప్ ను వెనక్కి నెట్టి మరీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు.

పల్లవి ప్రశాంత్ కు 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో పాటు.. రూ.15 లక్షలు విలువైన డైమండ్ నెక్లెస్, రూ .15 లక్షలు విలువైన కారు బహుమతులుగా లభించాయి. పల్లవి ప్రశాంత్ ముందుగా చెప్పినట్టుగానే రూ .35 లక్షలు పేదలకు పంచాల్సి ఉన్నది.. బిగ్ బాస్ షో ముగిసి ఇప్పటికీ రెండు మాసాలు అవుతున్నప్పటికీ.. ఈ డబ్బులను పల్లవి ప్రశాంత్ అసలు పంచలేదు. దీంతో పల్లవి ప్రశాంత్ మాట తప్పాడంటూ విమర్శలు కూడా రోజురోజుకీ వినిపిస్తూనే ఉన్నాయి.

- Advertisement -

ఈ విమర్శలు తన వద్ద వరకు వెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా తాను త్వరలోనే డబ్బులు పంచబోతున్నట్లు తెలియజేశారు.. ప్రాణం పోయినా ఇచ్చిన మాటని వదులుకోనని.. దానికోసం ఎంత దూరమైనా వెళ్తానని.. ప్రతి రైతుకు కూడా ఈ బిగ్ బాస్ మనీ పంచేందుకు తాను త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ తెలిపారు. తనపై వస్తున్న విమర్శలకు పోస్ట్ ద్వారా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.. అయితే ఇందులో పన్ను కోత ఉండడం వల్ల కేవలం తనకు 16 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.ఈ రూ.16 లక్షలు పేద రైతులకు పంచబోతున్నారట. అయితే ఈ విషయం తెలిసి పంచి చూపించు అప్పుడే నమ్ముతాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి పల్లవి ప్రశాంత్ మాట నిలబెట్టుకుంటారో లేదో చూడాలి అంటే తను సంపాదించుకున్న డబ్బు రైతులకు చేరి.. వారు నోరు విప్పినప్పుడే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు