Kalki 2898 AD: క్రేజీ అప్డేట్ 

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద సినిమాలలో కల్కి ఒకటి. ఈ సినిమా గురించి కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా ప్రశాంతనీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రభాస్ కి స్ట్రాంగ్ కంబ్యాక్ అనిపించుకుంది.

ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. ఆ సినిమాలో మనుషుల్ని, వ్యక్తిత్వాన్ని, ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించి అందరిని ఆకట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల దగ్గర శిష్యరికం చేసిన నాగ్ అశ్విన్ తన గురువు పంథాలోనే సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. నాగ్ అశ్విన్ చేసిన రెండవ సినిమా మహానటి.

మహానటి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కీర్తి సురేష్ ని హీరోయిన్ గా పెట్టి మహానటి సినిమా తీయడం అనేది ఒక సాహసం అనే చెప్పాలి. ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. తెలుగు సినిమా హీరోయిన్ బయోపిక్ తీస్తూ ఒక మలయాలి యాక్టరస్ ను ఎంచుకోవడం ఏంటి అని కొన్ని విమర్శలు కూడా వినిపించాయి. కానీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే చాలామంది నోళ్ళు మూసుకుపోయాయి.

- Advertisement -

ఇకపోతే మహానటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు థియేటర్ కి ఆడియన్స్ రావడం మానేశారు అనుకునే ఆలోచనలో ఉన్న చాలామందికి, లేదు ఒక ఖచ్చితమైన సినిమా తీస్తే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్ కి వస్తారు అని నిరూపించిన సినిమా మహానటి. ఆ సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విధానం, కొన్ని సీన్స్ ఇప్పటికీ కళ్ళలో నీళ్లు తెప్పిస్తాయి.

మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ నుంచి ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో కల్కి సినిమా వస్తుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. దిశా పటాని ప్రభాస్ మధ్యలో ఒక డ్యూయెట్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సాంగ్ కొన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది అనేది సమాచారం. ఏదైనా ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని ఇంకొంత పెంచుతుంది అనడంలో సందేహం లేదు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు