Esha deol: విడాకుల విషయంలో ఈషా అతడి మాట వింటుందా..?

ఎక్కడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. అయితే ఇద్దరూ కూర్చుని వాటిని పరిష్కరించుకుంటే విడాకుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు.. కానీ తమ మధ్య గొడవలు తారస్థాయికి చేరినప్పుడు.. కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉండాల్సిందే..ఇక కుటుంబ సభ్యులు చెప్పినా కూడా వినకపోతే ఆ తర్వాత వారు విడాకుల వరకు వెళ్తారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కుమార్తె.. ప్రముఖ నటి ఈషా డియోల్ తాజాగా తన భర్త భరత్ తఖ్తానీ తో విడిపోతున్నట్లు ప్రకటించింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈషా, భరత్ ఇద్దరూ కూడా తమ పిల్లల కోసం తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని తండ్రిగా ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపోతే 2012లో వివాహం చేసుకున్న ఈషా – భరత్ లకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు.. వారు రాధ్య , మీరయా.. ఇక ధర్మేంద్ర తన కుమార్తె నిర్ణయానికి వ్యతిరేకం కానప్పటికీ ఆమె దాని గురించి మరొకసారి ఆలోచించాలని కోరుకుంటున్నారు.. వాస్తవానికి ఈషా దంపతులిద్దరూ కూడా ధర్మేంద్రను అమితంగా గౌరవిస్తారు.. ఈషా కుటుంబానికి భరత్ కొడుకు లాంటివాడు..తమ ఇద్దరు కూతుళ్లను తండ్రి ధర్మేంద్ర కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు వాళ్లు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కూతురు తీసుకున్న నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేశారు.. అందుకే వారు మళ్లీ విడిపోవడం గురించి పునరాలోచన చేయాలని కూతుర్ని కోరినట్లు తెలుస్తోంది..

వాస్తవానికి రాధ్య, మీరయా ఇద్దరూ కూడా అమ్మమ్మ, తాతయ్యలతో చాలా సన్నిహితంగా ఉంటారు. తల్లిదండ్రులు విడిపోతే పిల్లలపై ఆ విషయం మరింత ప్రభావితం చేస్తుంది.. అందుకే తమ బంధాన్ని కాపాడుకోవాలని ధర్మేంద్ర భావిస్తున్నారట.. ఇకపోతే ఫిబ్రవరి 7వ తేదీన తామ విడిపోతున్నట్లు ఒక వార్త ప్రకటించారు. అంతేకాదు ఒక సంయుక్త ప్రకటనలో వారు మాట్లాడుతూ.. పరస్పర స్నేహపూర్వకంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నాము.. మా జీవితంలో ఈ మార్పు ద్వారా మా ఇద్దరి పిల్లల సంక్షేమానికి ఎటువంటి ఆటంకం కలగకూడదని భావిస్తున్నాము అంటూ తెలిపారు.. ఇకపోతే వీరి వివాహమై 11 సంవత్సరాలవుతుంది .. ఇప్పుడు విడిపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.. అయితే ఈషాకు తన రెండవ బిడ్డ పుట్టిన తర్వాత వారి దాంపత్యంలో కలతలు చోటు చేసుకున్నాయని.. అందుకే విడిపోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈషా తన తండ్రి మాటను దృష్టిలో పెట్టుకొని విడాకులను రద్దు చేసుకుంటుందేమో చూడాలి.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు