Vasanthi Krishnan : కాబోయే భర్తతో బిగ్ బాస్ బ్యూటీ ముద్దులాట… తెగించారు అంటూ ట్రోలింగ్

నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. భర్తతో ఆమె ముద్దులాటలో మునిగిపోయిన ఆ వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంత కాబోయే భర్త అయినప్పటికీ మీడియా ముందు ఆ చండాలమైన పనులేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

వాసంతి కృష్ణన్ కు పలు సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో గ్లామర్ పరంగా, అలాగే మంచితనంతో చాలామంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఏమాత్రం నెగెటివిటీ లేకుండా షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే చాలా కాలం తర్వాత ఈ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. అందుకు కారణం తాజాగా ఆమె ముద్దులు పెడుతూ రెచ్చిపోయిన వీడియో బయటకు రావడమే. రీసెంట్ గా తనకు కాబోయే భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తమ వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ముందుగా కేక్ కట్ చేసి ఆ ఇంటర్వ్యూను ప్రారంభించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా వాసంతి, పవన్ కళ్యాణ్ ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఆ తర్వాత వాసంతి కృష్ణన్ కు ఫ్లవర్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశాడు. ఈ క్రమంలోనే వాసంతి ఎమోషనల్ అయిపోయింది. అనంతరం తనకు కాబోయే భర్త గురించి చాలా విషయాలు చెప్పింది.

https://publish.twitter.com/?url=https://twitter.com/GetsCinema/status/1759122931622588857#

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ఫైనల్ గా వారికి ఒక టాస్క్ ఇచ్చారు యాంకర్. ఒక బౌల్ లో ద్రాక్ష పళ్ళు ఇచ్చి, చేతులతో పట్టుకోకుండా ఒకరికొకరు నోటితో తినిపించుకోవాలి అన్నదే ఆ టాస్క్. అలా ఎవరు ఎక్కువగా తినిపిస్తే వాళ్లే గెలిచినట్టు అని చెప్పారు. దాంతో ముందుగా వాసంతి ట్రై చేసింది. తరువాత పవన్ కళ్యాణ్ వాసంతికి తినిపించాడు. అయితే ఈ క్రమంలోనే దాదాపుగా ఇద్దరూ ముద్దులు పెట్టుకున్నట్టుగా అయ్యింది. కొన్నిసార్లు వాసంతి తినడం ఆపేయడంతో పవన్ ఫోర్స్ ఫుల్ గా ఆమెకు ద్రాక్ష తినిపించాడు. అయితే ఈ తతంగం అంతా చూస్తున్న వాళ్లకు ఎబ్బెట్టుగా అనిపించింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కాబోయే భార్య భర్తలు అయితే మాత్రం ఇలా మీడియా ముందు ఇలాంటి పనులు చేయడం ఏంటి? అంటూ దారుణంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు వాసంతిపై నెగిటివిటీ రాలేదు కానీ, ఈ వీడియోతో మొదలైంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు