Operation Valentine : వరుణ్ కు చెర్రీ, సల్మాన్ సాయం… ఇలాగైనా గట్టెక్కుతాడా?

కెరీర్లో గత కొంతకాలంగా గడ్డి దశను ఎదుర్కొంటున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేస్ లోకి ఎంటర్ కావడానికి రెడీ అవుతున్నారు. “ఆపరేషన్ వాలెంటైన్” సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే వరుణ్ చేస్తున్న ఈ ప్రయత్నానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సాయం చేయబోతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ సపోర్ట్ తోనైనా వరుణ్ గట్టెక్కుతాడా? అనేది తెలియాలంటే…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వార్ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానసి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతోంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ స్ట్రైక్ అంటూ రిలీజ్ అయిన “ఆపరేషన్ వాలెంటైన్” టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఎయిర్ ఫోర్స్, వైమానిక దాడులు ప్రధాన కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దేశభక్తి, ప్రేమ పంటి అంశాలను కలగలిపి కమర్షియల్ వార్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఎయిర్ స్ట్రైక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ ఈ సినిమాలో కెప్టెన్ రుద్రగా కనిపించబోతుండగా, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు టీజర్ ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. పలు వాయిదా అనంతరం ఈ మూవీని మార్చ్ 1న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఇక సినిమా రిలీజ్ కు ఎక్కువగా సమయం లేకపోవడంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. తాజాగా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 20న ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు “ఆపరేషన్ వాలెంటైన్” ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఫైనల్ స్ట్రైక్ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ ట్రైలర్ ను తెలుగులో రామ్ చరణ్ చేతుల మీదుగా, హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా టీం లాంచ్ చేయబోతోంది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. మరి వీరిద్దరి సపోర్ట్ “ఆపరేషన్ వాలెంటైన్”కు ఎంత వరకు ఉపయోగపడుతుంది? అంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు