Ooru peru Bhairavakona : వీకెండ్ కుమ్మేసింది! కానీ?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో “ఊరుపేరు భైరవకోన” ఒకటి. ఫిబ్రవరి 16న రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నా. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో థియేటర్ల దగ్గర బాగా ఆడుతుంది. ముఖ్యంగా బీసీ థియేటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన vi ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక సంక్రాంతి తర్వాత థియేటర్ల వద్ద ఆకట్టుకునే సినిమా ఏది పెద్దగా రాకపోవడంతో ఈ సినిమాకి ప్లస్ అయింది. ఆ మధ్య అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఒక వర్గం ప్రేక్షకులని ఆకట్టుకుంది. మొన్న వచ్చిన ఈగల్ నిరుత్సాహపరిచింది.

ఇక ఈ వారం వచ్చిన ఇతర చిన్న సినిమాలు రిలీజ్ కి ముందే బ్యాడ్ టాక్ తో దెబ్బేసాయి. అందుకే ఆడియన్స్ కి ఏకైక ఆప్షన్ గా నిలిచిన ఊరు పేరు భైరవకోన థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఇక మొదటి రోజు డీసెంట్ వసూళ్లు సాధించిన భైరవకోన రోజురోజుకి మంచి హోల్డ్ సాధిస్తూ మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్ తో అదరగొట్టింది.

రెండు రోజుల్లో 4.55 కోట్లకి పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్లు, వరల్డ్ వైడ్ గా 2.10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక వీకెండ్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 6.85 కోట్ల షేర్, 13.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే మేకర్స్ ఇప్పటికే 20 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటాయని ప్రకటించినా, అఫిషియల్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఇంకాస్త దూరంలో ఉంది. ఇక 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 4 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. మరి వర్కింగ్ డే అయిన సోమవారం ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ ని బట్టి సినిమా ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు