Ooru peru bhairavakona : రెండోరోజు కుమ్మేసిన భైరవకోన..

టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఊరు పేరు భైరవకోన” సినిమా ఫిబ్రవరి 16న వరల్డ్ వైడ్ గా అయిన సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాలు పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ కాగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. VI ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను “ఏకే ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించడం జరిగింది. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కథ యావరేజ్ గా ఉన్నా, కొంత వరకు స్క్రీన్ ప్లే మెప్పించడంతో ఒక వర్గం ఆడియన్స్ ని మెప్పిస్తుంది.ఇక స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోలు వేయడం కూడా దీనికి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు.

ఇక ఫస్ట్ డే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, నిజానికి సందీప్ కిషన్ కి ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 1.55 కోట్ల షేర్ సాధించగా, రెండో రోజు సాలిడ్ గ్రోత్ చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో 1.65 కోట్ల షేర్ వసూలు చేయగా, రెండు రోజుల్లో 3.75 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 4.85 కోట్ల షేర్, 9.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఊరు పేరు భైరవకోన 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ కాగా, ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలంటే 6 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఆదివారం వీకెండ్ అడ్వాంటేజ్ తో మరింత గ్రోత్ చూపించే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ సినిమాలో వర్ష బొల్లమా, కావ్య థప్పర్ హీరోయిన్లు గా నటించగా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఇలాగే మొదటివారం పూర్తయ్యే వరకు కలెక్షన్స్ హోల్డ్ చూపిస్తే సందీప్ కిషన్ కి కం బ్యాక్ హిట్ వచ్చి పడినట్టే అని చెప్పొచ్చు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు