Pooja hegde : సొంతగూటికి చేరేందుకు బుట్టబొమ్మ ప్లాన్?

టాలీవుడ్ లో బుట్ట బొమ్మ గా ఫేమస్ అయిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినా తన గ్లామర్ షో తో ఆకట్టుకుని పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టింది. పవన్ కళ్యాణ్ మినహా అందరు యంగ్ స్టార్ హీరోలతో నటించిన ఈ భామ లాక్ డౌన్ తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. అప్పటివరకు నెంబర్ వన్ రేసులో ఉన్న ఈ భామ వరుస ప్లాపులతో సతమతమవగా, బాలీవుడ్ పై మోజుతో వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంది.

ఇక తన తప్పు తెలుసుకునే సరికి బాగా లేట్ అయింది. అయినా గత ఆరు నెలల నుండి టాలీవుడ్ లో అప్పుడప్పుడూ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వస్తూ సందడి చేసింది. కానీ ఈ భామకు తెలుగు డైరెక్టర్లు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. కనీసం తమిళ్, కన్నడ మేకర్స్ అయినా పట్టించుకుంటారేమో అని ఎదురు చూస్తూ రకరకాల ఫోటోషూట్లు కూడా చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఇక తాజాగా సౌత్ స్టైల్ లో మంగుళూరు స్టైల్ అంటూ మంగుళూరు అమ్మాయినంటూ సంప్రదాయ డ్రెస్సులో ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియా లో పెట్టడం జరిగింది.

మంగి వెడ్డింగ్స్ అని ఏవో మార్కెటింగ్ యాడ్ చేసినా అందులో ఉద్దేశం మాత్రం మూవీ ఛాన్సులకోసమే అని తెలుస్తూనే ఉంది. ఇక ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన దేవా అనే సినిమాలో నటిస్తుండగా, ఆ సినిమా మినహా వేరే సినిమా ఆఫర్ లేదు. అందుకే మళ్ళీ సౌత్ ని నమ్ముకుని ట్రేడిషనల్ వే లో ఇంస్టాగ్రామ్ లో సెంటిమెంట్ ని పండిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రేడిషనల్ గెటప్ లో పూజా హెగ్డే బాగానే ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు