Devara : అటు రిలీజ్ అయిందో లేదో.. ఇటు రికార్డులు..

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న “దేవర” సినిమాపై నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిసిందే. అయితే దేవర ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఒక భారీ పాన్ ఇండియా మాస్ సినిమా రాబోతుందని ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అయితే జనవరి 8న రిలీజ్ అయిన ఈ టీజర్ కొద్దీ నిమిషాల్లోనే సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ స్టఫ్ టీజర్ లో కొరటాల శివ ఇచ్చేయగా, ట్రెండింగ్ సంగతి ఫ్యాన్స్ చూసుకుంటున్నారు. ఇలా రిలీజ్ అయిందో లేదో, అలా ట్రెండింగ్ లోకి వచేయగా, రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే దేవర యూట్యూబ్ రికార్డుల వేట లో పడ్డాడు. అనిరుద్ మ్యూజిక్ తో కొరటాల శివ మార్క్ ఫైట్ సీన్ సన్నివేశాలతో మ్యాజిక్ చేసిన దేవర టీజర్ అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, యూట్యూబ్ లో రిలీజ్ అయిన కేవలం 5 గంటల్లోనే ఐదు లక్షలకి పైగా లైక్స్ కొట్టేసింది.

ఇక ఈ విషయాన్నీ మూవీ మేకర్స్ కూడా మెన్షన్ చేస్తూ టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో ఐదు లక్షల లైక్స్ పొందిన టీజర్ గా దేవర ని మెన్షన్ చేసారు. ఇక అటు వ్యూ పరంగా కూడా ఐదు గంటల్లో 6 మిలియన్ల కి పైగా వ్యూస్ తో దూసుకుపోతున్నాడు. మరి 24 గంటలు ముగిసే సరికి ఎలాంటి రికార్డులు నమోదు చేస్తాడో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు