Devara teaser Talk: సముద్రంలోకి “దేవర” అడుగెట్టగానే… ఎరుపెక్కేసినాది..

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “దేవర” టీజర్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిసిందే. అయితే దేవర ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఒక భారీ పాన్ ఇండియా మాస్ సినిమా రాబోతుందని ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక కాసేపటికి రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. టీజర్ చూసాక ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ స్టఫ్ టీజర్ లో కొరటాల శివ ఇచ్చేసాడని అనిపిస్తుంది. ఈ టీజర్ లో స్టోరీ గురించి పెద్దగా హింట్ ఏమి ఇవ్వకపోయినా, అనిరుద్ మ్యూజిక్ తో కొరటాల శివ మార్క్ ఫైట్ సీన్ సన్నివేశాలతో మ్యాజిక్ చేసారని చెప్పొచ్చు. అన్నిటికి మించి టీజర్ లో ఎన్టీఆర్ ఒకడ్ని నరుకుతుంటే ఆ రక్తం ఆకాశంలో సగం కనిపించే చంద్రుడ్ని ఫుల్ చేసే సీన్ హైలెట్ అసలు.

ఇక ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోందని అర్ధమవగా, నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. రత్నవేలు ఇచ్చిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ ఒక సముద్ర తెగ కి చెందిన నాయకుడిగా నటిస్తుండగా, టీజర్ లో ఏవో షిప్ లో ఎదో సరుకు రవాణా చేస్తున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లు వెయిట్ చేయించి, చేయించి కొరటాల శివ సాలిడ్ స్టఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. అయితే టీజర్ లో ఇతర నటీనటులు మాత్రం కనిపించలేదు. చివరగా అనిరుద్ మార్క్ స్టయిల్ లో ఇంగ్లీష్ లో బీజీఎమ్ సాంగ్ పాడుతూ ఆలా హై ఇస్తుంటే, టీజర్ ముగిసాక ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఉంటుంది.. ఊర మాస్ అసలు..

- Advertisement -

” ఈ సముద్రం చాపల కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చూసుండాది”, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ చెప్తుంటే.. ఏ ఒక్క డైలాగ్ తో సినిమాని ఏ రేంజ్ లో డైరెక్టర్ చూపిస్తున్నాడో తెలుస్తుంది. ఇక దేవర 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు