Guntur Kaaram: షాకింగ్ లీక్… రమణ గాడికి ఒక కన్ను కనిపించదా?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీకి సంబంధించిన ట్రైలర్ ఆదివారం రోజు రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ వల్ల సినిమాలో హీరో రోల్ ఎలా ఉంటుంది అనే విషయం తెలిసిపోయింది. నిజానికి ఈ విషయాన్ని ట్రైలర్ లో ఎవరూ పెద్దగా గమనించి ఉండరు. ఈ సినిమాలో రమణ గాడికి ఒక కన్ను కనిపించదు అనే విషయం ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. ఈ మూవీలో మహేష్ బాబు సరసన యంగ్ హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉండగా తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మహేష్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక ఈ ట్రైలర్లో రెండు గంటలకు పైగా ఉన్న సినిమాని రెండు నిమిషాల 40 సెకండ్లలోనే చూపించేశాడు త్రివిక్రమ్.

ఫైట్స్, కామెడీ, సెంటిమెంట్ వంటి ఎమోషన్స్ అన్నింటిని మిక్స్ చేసి పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా “గుంటూరు కారం” ఉండబోతుందనే విషయాన్ని ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ఈ ట్రైలర్ ద్వారానే సినిమాలో హీరో రోల్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై హింట్ ఇచ్చాడు త్రివిక్రమ్. “గుంటూరు కారం” మూవీలో రమణ గాడి పాత్రలో కనిపించబోతున్న మహేష్ బాబుకు ఓ ప్రమాదంలో కన్నుకు గాయం కావడంతో అది కనిపించదనే విషయాన్ని ట్రైలర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -

ట్రైలర్ ను నిశితంగా గమనిస్తే అందులో మహేష్ బాబు ఎక్కువగా ఒక కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇక ట్రైలర్ స్టార్టింగ్ లో 10 సెకండ్ల నిడివి దగ్గర చూస్తే చిన్నగా ఉన్నప్పుడు హీరో ఎడమ కంట్లో నిప్పు పడినట్టుగా చూపించారు. అలాగే ట్రైలర్ 52 సెకండ్ల నిడివి దగ్గర చూసుకుంటే రమణ గాడు తన ఎడమ కన్నును పూర్తిగా మూసేసి, కుడి కన్నుతో హీరోయిన్ ను చూస్తాడు. అలా ట్రైలర్లో మహేష్ కనిపించిన కొన్ని సన్నివేశాల్లో ఎడమ కన్నును పూర్తిగా మూసేసి కుడి కన్నుతో మాత్రమే చూస్తూ ఉంటాడు.

Big leak from Guntur Karam... Did Mahesh Babu have eyes?

అంటే ఈ మూవీలో మహేష్ బాబుకు ఒక కన్ను కనిపించదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. హీరోకు ఉన్న లోపాన్ని మేనరిజంలా మార్చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. ఇక ట్రైలర్ చివర్లో మహేష్ బాబు చెప్పే ఎమోషనల్ డైలాగ్ అందరినీ కదిలించేసింది. అయితే అది హాస్పిటల్ అన్న విషయం చాలామందికి అర్థం కాలేదు. ఇలా ట్రైలర్లో చాలా విషయాలను దాచాడు త్రివిక్రమ్. కానీ ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రం “గుంటూరు కారం” ట్రైలర్ పెద్దగా నచ్చలేదు. ట్రైలర్లో సౌండ్ మిక్సింగ్ ప్రాబ్లం ఉండడమే అందుకు అతి పెద్ద కారణం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు