Mahalakshmi: ప్రాణాపాయ స్థితిలో నటి మహాలక్ష్మి భర్త.. ఏమైందంటే..?

ప్రముఖ సీరియల్ నటి మహాలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ను వివాహం చేసుకున్న తర్వాత మరింత వైరల్ గా మారింది. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రవీందర్ ను డబ్బు కోసమే వివాహం చేసుకుందనే విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇదిలా ఉండగా తాజాగా మహాలక్ష్మి భర్త ప్రముఖ నిర్మాత రవీందర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నిర్మాతగానే కాకుండా బిగ్ బాస్ షో పై విమర్శకుడిగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్న రవీందర్ గురించి అందరికీ సుపరిచితమే. తన ప్రైవేటు యూట్యూబ్ ఛానల్ లో ప్రతిరోజు బిగ్ బాస్ షో పై రివ్యూ ఇస్తూ ఉండే ఈయన ఎక్కువగా మొన్నా మధ్య వార్తల్లో నిలిచిన విషయం అందరికీ తెలుసు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న రవీందర్ 2022లో.. భర్తను వదిలేసి విడాకులు తీసుకున్న వివాదాస్పద నటి, సీరియల్ స్టార్ మహాలక్ష్మిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా అప్పట్లో వీరి వివాహం చాలా చర్చనీయాంశం అయింది. ఇక పెళ్లయిన ఏడాదికే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జైలుకు వెళ్ళాడు. సినిమా షూటింగ్ పేరుతో మనీ లాండరింగ్ చేశారని.. ఒక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలు ఈయనపై చేయబడ్డాయి. దాంతో నెలకు పైగా జైలు జీవితం గడిపాడు.

తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన ఈ తమిళ ప్రొడ్యూసర్ బిగ్ బాస్ సీజన్ 7 పై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. ఇకపోతే తాజాగా బిగ్ బాస్ షో సమీక్షకి వచ్చిన ఈయన అనారోగ్యంతో కనిపించారు. రవీందర్ కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. అయినా సరే తన యూట్యూబ్ ఛానెల్ లో రివ్యూలు ఇచ్చాడు. అయితే ముక్కులో ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకొని మరీ ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నాడు రవీందర్.. దీంతో అభిమానులు ఆందోళన చెందగా.. ఈయనకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని.. అంతేకాదు వారం రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించామని రవీందర్ తెలిపారు. ఇక ఇది విన్న అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు