Hanuman Controversy: మహేష్ బాబు థియేటర్లో “హనుమాన్”కు నో ఎంట్రీ… ప్రీమియర్ షోలు క్యాన్సిల్

సంక్రాంతి సినిమాల విషయంలో టాలీవుడ్ లో థియేటర్ల సమస్య రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సస్పెన్స్ మూవీని తలపిస్తోంది. తాజాగా మహేష్ బాబు థియేటర్ లో ముందుగా ప్లాన్ చేసిన “హనుమాన్” పెయిడ్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయన్న వార్త టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. కేవలం ఏఎంబి థియేటర్లో మాత్రమే కాకుండా అల్లు అర్జున్ భాగస్వామిగా ఉన్న మరో మల్టీప్లెక్స్ ఏఏఏ లోనూ “హనుమాన్” ప్రీమియర్ షోలకు నో ఎంట్రీ. మరి దానికి కారణం ఏంటి? అంటే…

ఈ సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లతో పాటు యంగ్ హీరో తేజ సజ్జ కూడా ఈ సంక్రాంతి బరిలోకి దిగాడు. అయితే వీళ్ళందరితో పోలిస్తే తేజ సజ్జ చిన్న హీరోనే. కానీ ఆయన హీరోగా నటిస్తున్న “హనుమాన్” మూవీ పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఎవరికైనా దిమ్మతిరిగి పోవాల్సిందే. ఈ సినిమాకు సరైన థియేటర్లు ఇవ్వడం లేదు అనేదే ఇక్కడ వివాదం. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న “గుంటూరు కారం” మూవీ నైజాం రైట్స్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. నైజాం, విశాఖలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. దీంతో మెజారిటీ షోలను, థియేటర్లను “గుంటూరు కారం” మూవీకి కేటాయించడం దగ్గరే వివాదం మొదలైంది. దీనంతటి వెనక దిల్ రాజు హస్తం ఉందంటూ వార్తలు రాగా ఇటీవల ఆయన స్పందిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతలోనే ఏఎంబి థియేటర్ తో మరో సమస్య మొదలైంది.

“హనుమాన్” మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ జనవరి 12న రిలీజ్ అవుతున్న “హనుమాన్” మూవీ షోల షెడ్యూల్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించి, మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబిలో ఈరోజు షోలను క్యాన్సిల్ చేశారట. తెలంగాణలో “హనుమాన్” మూవీ కోసం ముందుగా బుక్ చేసుకున్న నాలుగు థియేటర్లు మైత్రి వాళ్లతో అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుని, దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ తో అగ్రిమెంట్స్ చేసుకోవడమే “హనుమాన్” ప్రీమియర్ షోలు క్యాన్సిల్ కావడానికి వెనుక ఉన్న అసలైన రీజన్ అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి ఈ రూమర్లను కొట్టి పారేస్తూ ఆ థియేటర్లను ముందుగా “గుంటూరు కారం” మూవీ కోసమే బుక్ చేశామని అంటున్నారు. పైగా “గుంటూరు కారం” మూవీ నైజాం రైట్స్ 40 కోట్లు అయితే, “హనుమాన్” రైట్స్ 7 కోట్లు మాత్రమే, ఈ రెండు సినిమాలను ఎలా కంపేర్ చేస్తారు అంటూ శిరీష్ రెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సింగల్ స్క్రీన్లు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనేది ఏషియన్ సునీల్ మాట అంటున్నారు. మొత్తానికి “హనుమాన్”కు ఉన్న నాలుగు థియేటర్లను కూడా లాగేసుకుంటున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు