Tollywood: పెళ్లికి సిద్ధమైన మరో టాలీవుడ్ బ్యూటీ..!

ఈ మధ్య కాలంలో ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు వివాహం చేసుకొని ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ క్రమంలోని ఇప్పుడు ఒక టాలీవుడ్ బ్యూటీ కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇకపోతే ఇప్పటికే తమన్న , రకుల్ ప్రీత్ సింగ్ ఏడాది పెళ్లి వైపు అడుగులు వేస్తున్నామంటూ ప్రకటించగా.. ఇప్పుడు వీరి బాటలోనే ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెర్మియా గత కొద్ది రోజులుగా ఒక తమిళ్ ప్రొడ్యూసర్ తో డేటింగ్ లో ఉందంటూ వార్తలు రాగా.. ఇద్దరు కూడా తమ రిలేషన్షిప్ ను బయటకు పెట్టకపోయినా ఇద్దరికీ సంబంధించిన ఫోటోలను మాత్రం షేర్ చేస్తూనే ఉన్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు మొన్నా మధ్య అతనితో కలిసి రీల్స్ కూడా చేసింది. అయితే ఈ విషయం వైరల్ అవుతున్న కొద్దీ తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అంటూ వివరించింది. ఇటీవల న్యూ ఇయర్ వేడుకలను కూడా అతనితోనే ఆండ్రియా జరుపుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆండ్రియా ఆ నిర్మాతను వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రధమార్ధంలోని వీరి వివాహం జరగబోతుందని సమాచారం.

అయితే ఇప్పటికే ఆ నిర్మాతకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారట.. అంతేకాదు కొన్నేళ్ళు గా తన భార్యకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెండేళ్ల క్రితం ఒక వెబ్ సిరీస్ కోసం ఆ ప్రొడ్యూసర్ ఆండ్రీయాని కలిసినట్టుగా తెలుస్తోంది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా ఇది కాస్త ప్రేమగా మారిందని.. ఇప్పుడు రిలేషన్ లో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు తమ బంధాన్ని పెళ్లితో అఫీషియల్ గా మార్చుకోవాలని భావిస్తున్నారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సిద్ధమవుతుందనే వార్తలు మాత్రం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు