Kollywood: మహాలక్ష్మి – రవీందర్ జంటకు కొత్త సమస్యలు ?

Kollywood: కోలీవుడ్ బుల్లితెర నటి మహాలక్ష్మి, ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ గతేడాది ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. వీరి వివాహమైనప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ వీరిద్దరికీ వ్యతిరేకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. మహాలక్ష్మి రవీందర్ ను డబ్బుకోసమే వివాహం చేసుకుందని… అంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రవీందర్ ఎన్నో ప్లాన్స్ వేశాడు అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.

ఆ తర్వాత రవీందర్ చీటింగ్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో మహాలక్ష్మి తనతో విడాకులు తీసుకుంటుందని ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వీటిని వీరిద్దరూ పట్టించుకోకుండా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు ఈ లవ్లీ కపుల్స్. ఇదిలా ఉండగా…. తాజాగా రవీందర్ తన యూట్యూబ్ లో పెట్టిన ఓ వీడియో వైరల్ అవుతుంది. అందులో రవీందర్ ఆక్సిజన్ ట్యూబ్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం తాను అనారోగ్యం బారిన ఉన్నట్టు తెలుస్తోంది. ఆక్సిజన్ పైపు పెట్టుకొని బిగ్ బాస్ కి రివ్యూలు ఇస్తున్నాడు. అయితే కొందరు ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారు ఏంటి అని అడగ్గా…. దానికి సమాధానంగా రవీందర్…. నా ఆరోగ్యం బాగలేదంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఊపిరితిత్తుల్లో తనకు ఇన్ఫెక్షన్ వచ్చిందని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని, వారం రోజులుగా హాస్పిటల్ లో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, తొందర్లోనే నా ఆరోగ్యం మెరుగయ్యి మళ్లీ ఎంతో ఆరోగ్యంగా మీ అందరి ముందుకు వస్తానంటూ రవీందర్ చెప్పుకొచ్చాడు. ఇక మరికొందరేమో ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇలాంటి వీడియోలు చేయడం అవసరమా అంటూ కామెంట్లు పెట్టారు. జాగ్రత్తగా ఉండండి అని చెబుతున్నారు. ఇక మరికొందరేమో మహాలక్ష్మి ఎక్కడ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వీరిద్దరి వివాహం అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటున్నారు ఈ జంట.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు