Prabhas – Maruthi Movie : బిగ్ అప్డేట్… టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

Prabhas – Maruthi Movie : సంక్రాంతి సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తున్నాయి. నిన్న వైజయంతి మూవీస్ వారు “కల్కి” మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయింది. మరి ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడు రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

రీసెంట్ గా “సలార్” మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. “బాహుబలి” తర్వాత హిట్ అనే మాటకు దూరమైన ప్రభాస్ ను ఈ మూవీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం డార్లింగ్ ఫాన్స్ అందరి దృష్టి ప్రభాస్ నెక్స్ట్ సినిమాలపైనే ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన మరో సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2828 AD” రిలీజ్ డేట్ ను తాజాగా నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీనీ నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ నిర్మాతలు తమ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మే 9న “కల్కి” మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు ప్రభాస్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ హారర్ మూవీలో హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను జనవరి 15న ఉదయం 7 గంటల 8 నిమిషాలకు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు పొద్దున్నే ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను రివీల్ చేసి ట్రీట్ ఇవ్వబోతున్నారన్నమాట. ప్రభాస్ పొంగల్ ఫీస్ట్ కు రెడీగా ఉండండి అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు వేసిన ట్వీట్ డార్లింగ్ ఫాన్స్ లో హుషారును పెంచేస్తోంది.

- Advertisement -

Prabhas - Maruthi Movie : Big update... title, first look release date fixed

ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ హారర్ కామెడీ అనే టాక్ నడుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడని, అలాగే ఫుల్ ఫన్ ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడని అంటున్నారు. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు డిసెంబర్ లోనే ప్రకటించారు. ఇక ఈ మూవీ టైటిల్ ను ఇప్పటిదాకా మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు కానీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం “రాజా డీలక్స్” అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ నడుస్తోంది. మరి ఒరిజినల్ టైటిల్ ఏంటో తెలియాలంటే మరొక రోజు వెయిట్ చేయాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు