Gunturu Kaaram: ఇటు వంశి.. అటు రాజు.. ఇద్దరూ మ్యానేజ్ చేయలేక… పాపం

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతికి థియేటర్లలో రచ్చ చేయడానికి జనవరి 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ప్రీమియర్స్ నుండే ఆడియన్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టింది. ఇక గుంటూరు కారం సినిమాపై లేటెస్ట్ గా మేకర్స్ ప్రెస్ మీట్ పెట్టగా, అక్కడ దిల్ రాజు, ఇంకా నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ముందుగా నాగ వంశి మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా కి మేము ఊహించిన దానికంటే ఫస్ట్ డే ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. చాలా కాలం తర్వాత ఓ రీజనల్ తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది అని అంటూనే, ప్రీమియర్స్ 1 AM షోల తర్వాత మా చిత్రానికి మిక్సడ్ రివ్యూ లు వచ్చాయి, కానీ ఈవినింగ్, నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేసిన తర్వాత సినిమాకు టాక్ పాజిటివ్‌గా మారిపోయింది అన్నాడు.

ఇక దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూనే, పండగ తర్వాతే మళ్ళీ అందర్నీ కలుస్తానని తప్పించుకున్నట్టు హింట్ ఇచ్చాడు. అయితే దిల్ రాజు గుంటూరు కారం సినిమా టాక్ గురించి మాట్లాడుతూ నాగ వంశి చెప్పినట్టుగానే ఈ సినిమాకి ముందుగా మిక్సడ్ టాక్ వచ్చింది, కొంతమంది ప్రేక్షకులు బాగుందన్నారు, మరి కొందరు బాగాలేదన్నారు, అయితే నిన్న ఉదయం మిక్స్డ్ రివ్యూలు వచ్చినా సాయంత్రానికి టాక్ సెటిల్ అయింది. నేను నిన్న సుదర్శన్ థియేటర్లలో రెండవసారి సినిమాని చూశాను అన్నారు.

- Advertisement -

అలాగే సినిమా అంటేనే వ్యాపారం. ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికీ మిత్రులు కాదు, శత్రువులు కాదు. ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడిని తిరిగి పొందడానికి ఎప్పుడూ ట్రై చేస్తుంటారు. పైగా ఈ థియేటర్ల గొడవ అని, లేక సినిమాల టాక్ గాని పండగ వరకే ఉంటుందని, ఒక సినిమా ఫైనల్ డే కలెక్షన్లను కూడా కలిపి మొత్తంమీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుందని, ఒక్క రోజుకే సినిమా టాక్ ని డిసైడ్ చేయకూడదన్నాడు.

అయితే ఓవరాల్ గా ఈ ప్రెస్ మీట్ ని గమనిస్తే దిల్ రాజు గాని, నాగ వంశి గాని జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి, కాస్త సింపతిని కూడా కోరుకుంటున్నట్టు, సినిమా టాక్ బాగుందని కవరింగ్ ఇస్తూ చాలా ట్రై చేస్తున్నారు. ఇక్కడ దిల్ రాజుగాని, నాగ వంశి గాని మాట్లాడే విధానం చూస్తుంటే మ్యానేజ్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తుంది. అయితే దిల్ రాజు అన్నట్టు సినిమా ఫైనల్ కలెక్షన్లను బట్టే సినిమా రిజల్ట్ ని అంచనా వేయాలని అన్నా కూడా ఫైనల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ మాత్రం లేదని తెలుస్తుంది. ఎందుకంటే దీనికి పోటీగా రిలీజ్ అయిన హనుమాన్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, తాజాగా రిలీజ్ అయిన సైన్ధవ్ కూడా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండింటికి కొన్ని థియేటర్లు ఆల్రెడీ వెళ్లిపోగా, రేపు నా సామి రంగ రిజల్ట్ కూడా గుంటూరు కారం కల్లెక్షన్లపై ప్రభావం చూపుతుంది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు