Kamal Haasan : ఈ ఏజ్ లో కూడా ఇదేం అరాచకంరా సామి… లైనప్ లో 8 సినిమాలు!

Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ తన వరుస లైనప్ లతో అభిమానుల్లో హుషారు పెంచేస్తున్నాడు. 60 ఏళ్లకు పైబడిన వయసులోనూ 30 ఏళ్ల హీరోలకు గట్టి పోటీనిస్తూ, వాళ్ల కంటే వేగంగా సినిమాలను చేస్తూ, వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. “విక్రమ్” మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన ఈ హీరో స్పీడుకు యంగ్ హీరోలు తట్టుకోలేకపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లని సెట్ చేసుకుంటూ, ఊపిరి సలపని షూటింగ్ షెడ్యూల్ తో ఈ వయసులోనూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు కమల్ హాసన్.

కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత డైరెక్టర్ శంకర్ తో “ఇండియన్ 2” మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. “ఇండియన్ 2” మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, “ఇండియన్ 3” షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీకి మరో నెల రోజులపాటు కమల్ హాసన్ తన డేట్స్ ఇచ్చేశాడు. ఆ తర్వాత కమల్ హాసన్ తన నెక్స్ట్ మూవీని మరో కోలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ మణిరత్నంతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా, ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. “ఇండియన్ 3” షూటింగ్ పూర్తవగానే మణిరత్నం మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరో నాలుగైదు సినిమాలను లైన్లో పెట్టాడు కమల్ హాసన్.

“ఇండియన్ 3”, మణిరత్నం మూవీ కంప్లీట్ అయ్యాక టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్ హాసన్ మరో మూవీ చేయనున్నాడు. ఈ మూవీ హై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. అనంతరం మరో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ – కమల్ హాసన్ కాంబోలో “విక్రమ్ 2” రెడీ కానుంది. ఇప్పటికే ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం కమల్ హాసన్ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “కల్కి 2898 AD” ప్రాజెక్ట్ లో కమల్ విలన్ గా కనిపించబోతున్నాడు.

- Advertisement -

ఈ లెక్క సరిపోదు అన్నట్టు స్టంట్ మాస్టర్ అన్బరివ్ ను లైన్లో పెట్టాడు. అన్బరివ్ దర్శకత్వంలో కమల్ హాసన్ మూవీ చేయబోతున్నాడు అనే విషయంపై ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. మరి ఇన్ని సినిమాల్లో ఏది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో? ఏది ముందుగా రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ లో ఏ ఒక్కరు కూడా కమల్ హాసన్ అంత బిజీగా లేరు అన్నది మాత్రం వాస్తవం

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు