Kamal Haasan: థగ్ లైఫ్ సీక్వెల్ మూవీనే… ఇదిగో ప్రూవ్!

కమల్ హాసన్.. ఉల‌గ‌నాయ‌గ‌న్ గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోకి, ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. విక్రమ్ సినిమా .. అయితే ఉల‌గ‌నాయ‌గ‌న్ మంచి స్టోరీ పడితే, రికార్డుల వేట ఉంటుందని నిరూపించింది. విక్రమ్ సినిమా తర్వాతే డైరెక్టర్స్ కి ఓ క్లారిటీ కూడా వచ్చింది… కమల్ హాసన్ తో ఎలాంటి స్టోరీలతో సినిమాలు చేయాలో అని చెప్పొచు. అందుకే ఇప్పుడు శంకర్ చేస్తున్న ఇండియన్ 2 కానీ, రాబోయే మణిరత్నం సినిమాపై గానీ, అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Read More: Thug Life: అతని పేరు రంగరాయ సత్తివేళ్ ‘నాయగన్’… గుర్తుంచుకోండి!

దీనిలో మణిరత్నం సినిమా KH234 వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ మెంట్ వచ్చింది. తాజాగా కమల్ 69వ పుట్టిన రోజు సంందర్భంగా కమల్ హాసన్ కొత్త మూవీ KH234 టైటిల్‌ని రివీల్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. థగ్ లైఫ్ అనే టైటిల్ తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలను షేక్ చేస్తుంది. టైటిల్ కి తగినట్టే… సినిమాలో కమల్.. భయంకరమైన గజ దొంగలా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈ వీడియోలో కమల్ చెప్పిన “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు” డైలాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతే కాదు… ఈ డైలాగ్ ఒక రకమైన చర్చకు కూడా దారి తీస్తుంది. అలాగే థగ్ లైఫ్ సీక్వెల్ మూవీ అని చెప్పడానికి ఈ డైలాగ్ ఓ కారణం అవుతుంది.

Read More: KH234 : పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్లాన్

కమల్ హాసన్ – మణి రత్నం కాంబినేషన్ లో 36 ఏళ్ల క్రితం నాయకన్ (తెలుగులో నాయకుడు) అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో హీరో పేరు నాయకర్.. అతని మనవడి పేరు శక్తివేల్ నాయకర్. ఇప్పుడు థగ్ లైఫ్ లో కమల్ తన పేరు.. రంగరాయ శక్తివేల్ నాయకర్ అని చెప్పడంతో… 36 ఏళ్ల కిత్రం వచ్చిన నాయకన్ మూవీకి, ఇప్పుడు థగ్ లైఫ్ మూవీకి సంబంధం ఉందని, ఇది సీక్వెల్ అని స్పష్టమవుతుంది. అయితే మూవీ టైం అయితే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు