Sharwanand: తండ్రి కాబోతున్న హీరో శర్వానంద్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోలలో శర్వానంద్ ఒకరు. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అకట్టుకునేలా సినిమాలు తీస్తుంటారు శర్వానంద్. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే శర్వానంద్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. జూన్ 3న హీరో శర్వానంద్ – రక్షిత రెడ్డిల వివాహం జైపూర్ లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ హాజరయ్యారు.

Read More: Sharwanandh : టాలీవుడ్ యంగ్ హీరోకి ఘోర రోడ్డు ప్రమాదం

శర్వా వివాహం చేసుకొని నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. ఇంతలోనే తన ఫ్యాన్స్ కి శుభవార్త అందించారు శర్వానంద్. తాను వివాహం చేసుకున్న రక్షిత రెడ్డి ప్రెగ్నెంట్ అయిందట. దీంతో శర్వానంద్ తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రక్షిత అమెరికాలో టెక్కీగా వర్క్ చేస్తుంది. పెళ్లి తర్వాత ఆమె తన వర్క్ కోసం అక్కడికి వెళ్ళింది. ఇక సినిమా షూటింగ్ ఉండడంవల్ల శర్వా ఇక్కడే ఉండిపోయాడు.

Read More:Sharwanand: మరో కొత్త సినిమాతో

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రక్షిత అక్కడే హాస్పిటల్ లో రెగ్యులర్ గా చెకప్ లకు వెళుతుందని.. శర్వానంద్ కూడా అక్కడే కొంతకాలం భార్యకు సహాయంగా ఉండేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే డెలివరీ అనంతరం తిరిగి హైదరాబాద్ కి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల విషయంలో శర్వానంద్ కానీ, ఆయన ఫ్యామిలీ గాని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ ప్రముఖ నవల ఆధారంగా తన 35వ చిత్రంలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు