Sharwanand: మరో కొత్త సినిమాతో

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లో శర్వానంద్ కూడా ఒకరు. కానీ, ఈ యంగ్ హీరో రక్షిత రెడ్డితో నిశ్చితార్తం కూదుర్చుకుని ఆ ట్యాగ్ ను వీడారు. వీరి ఎంగేజిమెంట్ కు ప్రముఖ సినీ పెద్దలతో పాటు యంగ్ హీరోలు కూడా హాజరు అయ్యారు. పెళ్ళి డేట్ పై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

కాగా విభిన్న కథాలను ఎంచుకొని మంచి హిట్స్ ను అందుకుంటున్నాడు శర్వానంద్. ఇటీవల “ఒకే ఒక జీవితం” విభిన్నమైన స్టోరీతో వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నారు. ఈ చిత్రం ఎమోషనల్ గా ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు సైన్ చేసిన ఈ కుర్ర హీరో, ఆ సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. “భలే మంచి రోజు” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్ ఆదిత్యతో శర్వానంద్ సినిమా సెట్స్ పై వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్నిర్మించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

అయితే ఇది ఇలా ఉండగా శర్వా తర్వాత మూవీ పై ఒక వార్త వైరల్ అవుతుంది. ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కెవి గుహన్‌ తో జతకట్టబోతున్నాడట. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన గుహన్‌.. శర్వానంద్ తో చేసే సినిమా స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తారని సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కాగా ఈ చిత్రంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

- Advertisement -

For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు