Akhil: రిలీజ్ డేట్ వచ్చేస్తుంది..

అక్కినేని నాగార్జున వారసులు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని హీరోలుగా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయ్యారు. నాగ చైతన్య మంచి ఫామ్ లో కొనసాగుతుండగా అఖిల్ మాత్రం తడబడుతున్నాడు. వరుస ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్నాడు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో కొంత మేరకు హిట్ ను అందుకున్నా, బ్లాక్ బస్టర్ ను మాత్రం ఇప్పటి వరకు అందుకోలేదు. ఈ సినిమా తర్వాత మళ్లీ అఖిల్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయలేదు.
అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా “ఏజెంట్“. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ భావించారు. కానీ, పెద్ద సినిమాలు లైనప్ కావడంతో మళ్లీ వాయిదా వేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం విడుదల తేది గురించి నుంచి మరో వార్త వినిపిస్తుంది.
“ఏజెంట్” చిత్రం ఏప్రిల్ 14న ఫాన్స్ ను అలరించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం నుంచి ఆఫిసియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా “ఏజెంట్” సినిమాతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సైరా నరసింహ రెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “ధృవ” తెలుగులో అందరి ప్రశంశలు అందుకున్న హిప్ హాప్ తమిజ్ ఈ చిత్రానికి సంగీతం వహించారు.
ఈ సినిమాతో అయిన అఖిల్ ట్రాక్ లో పడతారో లేదో ఏప్రిల్ 14 వరకు వేచి చూడాల్సిందే.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు