Thug Life: అతని పేరు రంగరాయ సత్తివేళ్ ‘నాయగన్’… గుర్తుంచుకోండి!

ఉలగనాయగన్ కమల్ హాసన్ తమిళ దిగ్దర్శకుడు మణిరత్నం కాంబో లో ఓ సినిమా తెరకెక్కుతోందని తెలిసిందే. ఇంతకు ముందు వీళ్ళ కాంబో లో వచ్చిన నాయకుడు ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు కలిసి సినిమా చేయలేదు. దాదాపు 36 ఏళ్ళ తర్వాత వీళ్ళ కలయిక లో సినిమా సెట్ అయింది. పైగా ఈ సినిమాని కమల్ హాసన్ స్వీయ నిర్మాణం లో తెరకెక్కిస్తుండడం విశేషం.

ఇప్పటివరకు మూవీ అనౌన్స్ మెంట్ మినహా ఏ అప్డేట్ రాలేదు. కానీ ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ తో సహా, కమల్ హాసన్ రోల్ ని కూడా ఇంట్రడ్యూస్ చేసారు.

Indian2: “సేనాపతి” తిరిగొచ్చేశాడు! ఇక వేట మొదలు

- Advertisement -

కాసేపటి కిందటే రిలీజ్ అయిన ఈ వీడియో లో కమల్ హాసన్ ఒక నడి వయస్కుడిగా కనిపించారు. అయితే ఈ ఫస్ట్ లుక్ వీడియో మొత్తం తమిళ్ లో ఉండగా, లాస్ట్ లో మాత్రం ఒక్క డైలాగ్ తో సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చేసారు. అదేంటంటే ” నా పేరు ” రంగరాయ సత్తివేళ్ నాయగన్”.. గుర్తుంచుకోండి అని అంటాడు. ఆ వెంటనే “థగ్ లైఫ్” అని టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఇక టైటిల్ ని, ఇంకా వీడియో ని బట్టి ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ దొంగల ముఠా నాయకుడిగా కనిపిస్తున్నాడని అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ జయం రవి తో పాటు, మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, త్రిష నటిస్తున్నారని అనౌన్స్ చేయడం జరిగింది. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు