JigarThanda Double X:ఆ డైరెక్టర్లతో చేసినవి ప్లాప్ అవడానికి కారణం?- లారెన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా జిగర్ తండా సినిమా చేయగా, ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న లారెన్స్ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఆ ప్రశ్నల్లో భాగంగా ఒక విలేఖరి మీరు సొంతంగా డైరెక్ట్ చేసే సినిమాలు హిట్ అవుతాయి. కానీ ఇతర డైరెక్టర్స్ తో మీరు హీరోగా చేసే సినిమాలు ఎక్కువగా ప్లాప్ అవుతున్నాయి ఎందుకు? అని అడిగాడు.

దానికి లారెన్స్ చాలా సున్నితంగా రిప్లై ఇచ్చాడు. లారెన్స్ మాట్లాడుతూ నేను డైరెక్ట్ చేసేటప్పుడు… ప్రేక్షకులకి ఏం కావాలో అది ఇవ్వాలి అని నేను భావిస్తాను. కానీ వేరే డైరెక్టర్లు నాకు చెప్పేది ఒకటి ఉంటుంది.. తీసేది ఒకటి ఉంటుంది. నేను వాళ్ళ డైరెక్షన్లో వేలు పెట్టను. అందుకే వాటి ఫలితాల గురించి నేను పట్టించుకోను’ అని అన్నారు.

Biggboss season7: నిన్న కార్తీ, నేడు లారెన్స్.. బిగ్ బాస్ ని బాగానే వాడుకుంటున్నారు!

- Advertisement -

అయితే లారెన్స్ చేసిన అందరు దర్శకుల సినిమాలు ప్లాప్ అవ్వలేదు. కొన్ని హిట్స్ కూడా అయ్యాయి. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన చంద్రముఖి2, రుద్రుడు సినిమాలు ప్లాప్ అవడంతో ఇలాంటి ప్రశ్నలు బాగా వస్తున్నాయి. అయితే లారెన్స్ వీటికి ఏమాత్రం కంగారు పడకుండా, ఇతర డైరెక్టర్లు కూడా నొచ్చుకోకుండా తెగ్గొట్టాడు అని చెప్పొచ్చు. ఇక లారెన్స్ నటించిన జిగర్ తండా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు