Biggboss season7: నిన్న కార్తీ, నేడు లారెన్స్.. బిగ్ బాస్ ని బాగానే వాడుకుంటున్నారు!

బుల్లితెరపై బిగ్ బాస్ షో ఓ రేంజ్ లో అదరగొడుతుంది. లాస్ట్ వీక్ లో బిగ్ బాస్ షో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగగా, సందీప్ ఎలిమినేషన్ నుండి, మళ్ళీ నామినేషన్ ప్రాసెస్ తో సహా, ఈ వారం టాస్క్ లలో కూడా డిఫరెంట్ గా సాగింది. ఇక ఈ వారం శోభా శెట్టి కెప్టెన్ కావడం కూడా వెరైటీ గా జరిగింది.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో లో సినిమా స్టార్స్ వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేయడం ఈ మధ్య రొటీన్ అయిపొయింది. లాస్ట్ ఇయర్ చాలా తక్కువగా ఈ తంతు జరగగా, ఈ సీజన్లో చాలా మంది వచ్చారు. రామ్ స్కంద ప్రమోషన్ కొరకు రాగా, రవితేజ, అనిల్ రావిపూడి తమ దసరా సినిమాల ప్రమోషన్స్ కి వచ్చి సందడి చేసారు.

ఇక నిన్ననే కార్తీ కూడా బిగ్ బాస్ షో కి జపాన్ ప్రమోషన్స్ కి వచ్చి సందడి చేయగా, లేటెస్ట్ గా లారెన్స్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. రాఘవ లారెన్స్ తాను హీరోగా నటించిన “జిగర్ తాండ” అనే సినిమాని ప్రమోట్ చేసేందుకు బిగ్ బాస్ షో కి ఎస్. జె. సూర్య తో కలిసి వచ్చాడు.

- Advertisement -

Biggboss season7: బిగ్ బాస్ ఇంటికి కార్తీ.. తెలిసిందేగా!

ఇక ఇక్కడ తాను కొరియోగ్రఫి చేసిన పాటలకి బిగ్ బాస్ ఇంట్లో స్టెప్స్ గెస్ చేసి వేయమని సరదా టాస్క్ వేయగా, మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ మూవీ అబిబి సాంగ్ స్టెప్ ని రాంగ్ గా వేసి గౌతమ్ ట్రోల్ అయ్యాడు. ఇక అమర్ దీప్ ఆ స్టెప్ ని కరెక్ట్ గా వేసి కంప్లీమెంట్స్ పొందాడు.

ఇక బిగ్ బాస్ షో కి వచ్చిన లారెన్స్ తన లైఫ్ జర్నీ అన్నపూర్ణ స్టూడియో లో నాగ్ సార్ వల్లే మొదలైందని, నాగ్ సార్ కి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని చెప్పాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు