Single Life: సోలో బ్రతికే సో బెటర్… సింగిల్‌గా ఉంటే ఇన్ని ప్రయోజనాలా?

మనం జీవించే సొసైటీలో ఇప్పటికి ఎన్ని తరాలు మారినా మ్యారేజ్‌కి, కమిట్ట్మెంట్‌కి ఇచ్చే విలువ ఏ మాత్రం తగ్గలేదు. అలాగే ఇప్పటికీ కూడా ఒకరు తమ జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నారో, వారి ఇష్టాలు ఏంటో అనేది పట్టించుకోకుండా, పెళ్లి చేస్తే సరిపోతుంది అని ఆలోచిస్తున్నవారు ఉన్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే.. పెళ్లి చేసుకోవడమే, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవడమే అంటూ పెద్దలు మన చిన్ననాటి నుంచే చెబుతున్నారు. ఎవరికైనా 23 ఏళ్ళు రాగానే, పెళ్లి పైన ఒత్తిడి అటు ఇంట్లో వాళ్ళ నుంచి, ఇటు చుట్టాలనుంచి బాగా పెరిగిపోతుంది.

అలంటి ఒత్తిడి వాళ్ళ ఎంతో మంది ఇష్టం లేకుండా పెళ్లి, రెలాషన్షిప్ లోకి వెళ్తున్నారు. ఈ ఒత్తిడి వాళ్ళ ఎన్నో రకాల కష్టాలను కూడా ఎదుర్కొంటు ఉన్నారు. మన లైఫ్ లోకి వచ్చే జీవిత భాగస్వామి మనల్ని గౌరవించకుండా, మనల్ని ఇబ్బంది పెట్టే వారు అయినప్పుడు, వారితో ఉండటం కంటే సింగిల్ గా ఉండి, జీవితాన్ని సంతోషంగా గడపడమే ఉత్తమం. ఇలా సింగిల్ గా ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్ధాం.

1. ఇండిపెండెన్స్

- Advertisement -

ఇండిపెండెన్స్ అనేది అంత కంప్లికేటెడ్ విషయం ఏమి కాదు. మనం ఒంటరిగా ఉన్నపుడు మన గురించి మనమే అన్ని చూసుకోవాలి. మన పైన మనకున్న బాధ్యతలను నిర్వర్తించుకుంటూ, అలా మనం ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకుంటాం. మనం ఎం చేయాలి అన్న కూడా బాధ్యత మనదే అవుతుంది.

2. మీరే మీ యజమాని

ఒంటరి గా జీవించే అప్పుడు మనం ఎం చేయాలి అన్నా, ఎక్కడికి వెళ్ళాలి అన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా మొత్తం మన చేతిలోనే ఉంటుంది. మనం ఎవరి దగ్గర అనుమతి తెసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఫ్రీడమ్ మనకి సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది.

3. మీతో మీరు హ్యాపీ గా ఉండటం

మనిషి అంటే సోషల్ అనిమల్ అని అందరు అంటారు, అంటే మనుషులతో కలిసి మెలిసి ఉండటం. అలా అని మనతో మనం సమయం గడపకుండా ఉండకూడదు. మనం సింగిల్ గా ఉన్నపుడు మనం మనతో కాస్త సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మనకు నచ్చినట్టు మనం ఉండేందుకు ఇది ఒక మంచి అవకాశం కూడా.

4. కంప్రమైస్ అవ్వాల్సిన అవసరం లేదు

ఎవరైనా ఓ రిలాషన్షిప్ లో ఉన్నపుడు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాళ్ళన్నా సరే ఇద్దరి అంగీకారం అవసరం. అందువల్ల ఆ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. ఇలాంటి గొడవలు రాకుండా, మనకి ఏది చేయాలి అనిపిస్తే అది మనమే నిర్ణయించుకుని ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ఉండొచ్చు.

5. మన కెరీర్

మనం ఓ రిలాషన్షిప్ లో ఉన్నప్పుడు మనం ఎం చేయాలి అన్నా, ఎలాంటి ఉద్యోగం చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అనే నిర్ణయం ఇద్దరు కలిసి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. జివిత భాగస్వామి నిర్ణయంపై మన కెరీర్ ఆధరపడి ఉంటుంది. కానీ, మనం సింగిల్ గా ఉన్నపుడు మన కెరీర్ గురించి, ఉద్యోగం గురించి, మన గోల్స్ గురించిన మొత్తం నిర్ణయం మన చేతిలో ఉండటం వల్ల ఎవరు ఎం అనుకుంటారో అనే భయం లేకుండా మనకి నచ్చింది మనం చేయవచ్చు.

6. మనల్ని మనం యాక్సెప్ట్ చేయటం

పెళ్లి జీవితంలో కానీ, రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కానీ మనం ఎలా ఉంటే పక్క వాళ్లు ఏం అనుకుంటారో, వారికి మనం చేసేవి నచ్చుతాయో లేదో అనే ఒత్తిడి ఉంటుంది. అదే సింగిల్ గా ఉంటే మనకి నచ్చినట్టు మనం ఉంటాం. అలా మనం మనల్ని ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీనితో మన పై మనకు ఓ అవగాహనా వచ్చి, మనతో మనం సంతోషంగా ఉండగలం.

7. మన పరిసరాలు మన ఇష్టం

మనం సింగిల్ గా ఎక్కువ రోజులు ఉండటం వాళ్ళ, మన పరిసరాలు మన పై ప్రభావం చూపిస్తాయి. మనం వాటికీ ఎలా మారిస్తే అవతలి వ్యక్తి ఎం అనుకుంటారో అనే భయం లేకుండా, మనకి నచ్చినట్టు, మనం మన పరిసరాల్ని మలచుకొని ఉండొచ్చు.

8. ఫోకస్

మనం సింగిల్ గా ఉన్నపుడు మన జీవితం లో ఎన్నో ఇతర స్కిల్స్, వేరే విషయాల పట్ల కూడా కాన్సన్ట్రేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది రిలాషన్షిప్ లో ఉన్నపుడు కాస్త కష్టం అనే చెప్పాలి. ఒకే విషయం ఇద్దరికీ నచ్చి, చేయాలనీ నిర్ణయించుకొని లోపు ఏదైన జరగొచ్చు. ఈ రిస్క్ సింగిల్ గా ఉన్నప్పుడు కాస్త తక్కువ.

9. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్

మనకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని భయం తో పాటు, దేనికైనా సిద్ధంగా ఉండాలి అని ఓ ఆలోచన కూడా ఉంది. ఇలాంటి సమయం లో సింగిల్ గా ఉంటే, మన సమయాన్ని కెరీర్ మీద కేటాయించి, సేవింగ్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంది.

10. హెల్తీ రిలేషన్ షిప్

మనకి మనతో హెల్తి రిలేషన్ షిప్ లేకపోతే, మనకి మన జీవితం లో వచ్చే వారితో కూడా మంచి రిలేషన్ షిప్ ఉండదు. మనతో మనం ఎంత సంతోషం గా ఉంటామో, మన జీవితం లో వచ్చే వారితో కూడా అంతే సంతోషం గా ఉంటాం. అయితే మనం సింగిల్ గా ఉన్నపుడు మనతో కాస్త సమయం గడుపుతూ మన గురించి మనం తెలుసుకోవచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు