Biggboss season7: బిగ్ బాస్ ఇంటికి కార్తీ.. తెలిసిందేగా!

బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయినప్పటినుండి ఉల్టా పల్టా గా ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఇక ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా శోభా శెట్టి కెప్టెన్ అవగా తాజాగా బిగ్ బాస్ లో ఈ వారానికి సంబంధించి ఒక ఫ్రెష్ న్యూస్ బయటికి వచ్చేసింది.

బిగ్ బాస్ షో లో కొన్ని కొన్ని సినిమా ప్రమోషన్లు కూడా అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయని తెలిసిందే. ఈ పద్ధతి బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు టెలివిజన్ లో ఏ షో అయినా దీని తర్వాతే ఉండేది. అంటే బిగ్ బాస్ షో ని జనాలు అంతలా ఫాలో అవుతున్నారని అర్ధం. అందుకే బిగ్ బాస్ షో లో స్టార్ హీరోలు కూడా తమ తమ సినిమాలను ప్రోమోట్ చేస్తుంటారు.

Biggboss season7: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి! కెప్టెన్ శోభా శెట్టి

- Advertisement -

ఇక ఈ సీజన్లో మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ అనిల్ రావిపూడి తమ తమ సినిమాలను ప్రోమోట్ చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో హీరో చేరారు.

కోలీవుడ్ స్టార్ కార్తీ లేటెస్ట్ గా తాను నటించిన “జపాన్” సినిమా ప్రమోషన్ కై నాగార్జున తో హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఇంటికి వెళ్లడం జరిగింది. ఇంకా ప్రోమోలు ఏమి రిలీజ్ కాలేదు గాని, అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జునని కలిసినట్టు ఫోటో లీక్ అయింది.

ఇక కార్తీ లాస్ట్ ఇయర్ కూడా తన సర్దార్ సినిమా ప్రమోషన్ కై బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చాడు. ఇప్పడు మళ్ళీ రెండో సారి తన ప్రమోషన్ కి రావడం జరిగింది. ఇక జపాన్ సినిమా ప్రమోషన్ లో కూడా నాగార్జున గురించి ప్రస్తావించడం కొసమెరుపు. అప్పుడే ఆడియన్స్ కార్తీ బిగ్ బాస్ షో కి ప్రమోషన్ కి వస్తాడని గెస్ చేసారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు