Biggboss season7: అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి! కెప్టెన్ శోభా శెట్టి

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 అదరగొడుతుంది. రోజుకో ట్విస్ట్ తో ఊహించని మలుపులతో ఉల్టా పల్టా గా సాగుతుంది. అయితే ఈ సీజన్లో గత సీజన్ల కన్నా భిన్నంగా సాగుతుండగా నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వీర సింహాల టీం విన్ అయినా వాళ్ళ తరపున పోరాడడానికి గర్జించే పులుల టీం పోరాడారు. అయితే నిన్న వచ్చిన ప్రోమోలో గర్జించే టీం నుండే పోటీ ఉండడంతో వాళ్ళ నుండే కెప్టెన్ అవుతారు అని అనుకున్నారు అందరు.

కానీ నైట్ షో చూసాక ఆడియన్స్ ఊహకు రివర్స్ ఉండగానే షాక్ అయ్యారు. ఇక పోతే అమర్ దీప్ తాను కెప్టెన్ అవుదామని ముందునుండి ఎంతో ప్రయత్నిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. దానికి తాను కూడా ఎంతో ట్రై చేస్తానని అన్నాడు. పైగా ఇంతకు ముందు కెప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ కానివ్వమని చాలా సార్లు అన్నాడు.

Biggboss season7: కెప్టెన్ కావాలనే మోజులో అమర్ సైకో అయిపోయాడా?

- Advertisement -

అందుకే నిన్న జరిగిన టాస్క్ లో చాలా సార్లు తన గేమ్ ఆడడం కన్నా, ఇతరుల్ని ఓడించడం పైనే దృష్టి ఎక్కువ పెట్టాడు. అయితే ఆ క్రమంలో భోలే, అశ్విని తో గొడవ కూడా పడ్డాడు. అయితే ప్రియాంక అమర్ ల మధ్య జరిగిన ఫైనల్ టాస్క్ లో ప్రియాంక గెలవాల్సింది. కానీ అమర్ అలర్ట్ అయ్యి కొన్ని సెకెన్ల లో ప్రియాంక బ్యాగ్ ఖాళీ చేసాడు. ఫలితంగా అమర్ గెలిచి, శోభా యొక్క సంచిని మోసి శోభా శెట్టిని కెప్టెన్ చేసాడు. ఇక హౌస్ లో శోభా శెట్టి కెప్టెన్సీ బ్యాడ్జ్ గెలుచుకున్న 5వ హౌస్ మేట్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు