Rana Daggubati: సడన్‌గా రూట్ మార్చేడు… ప్లాన్ ఏంటి అసలు?

రానా దగ్గుబాటి.. ఒక తెలుగు హీరో హిందీ స్టేట్స్ లో కూడా ఫ్యాన్స్ ఉంటారని ప్రూవ్ చేసిన హీరో. రానా చేసే సినిమాల్లో ఓ స్టైల్ ఉంటుంది. తనకు స్టోరీ నచ్చితే చాలు. తన పాత్ర ఎలాంటిది అని చూడకుండా చేసేస్తాడు. అలా వచ్చినవే.. అప్పటి బాహుబలి అయిన, ఇటీవల వచ్చిన విరాట పర్వం అయిన. ఈ విషయాన్ని స్వయంగా రానా కూడా చెప్పాడు.

అయితే సడన్ రానా తన రూట్ మార్చాడు. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా పాట్లు పడితే తాను ఎందుకు ఊరుకోవాలి అని అనుకున్నాడేమో… ఇప్పుడు కేవలం పాన్ ఇండియా స్థాయి కంటెంట్ పైనే ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే హిరణ్యకశిప సినిమా గురించి అన్నీ స్టార్ట్ చేశారు. అలాగే తలైవర్ 170లో రానా కీ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read More: Rana’s Next Movie: రానా, తేజ సినిమా అందుకే డిలే..?

- Advertisement -

ఇవే కాకుండా తాజాగా మరో పాన్ ఇండియా మూవీకి రానా సై అంటున్నాడట. బాహుబలి లాంటి సినిమాను నిర్మించిన ఆర్కామీడియా రానాతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను చేయడానికి రెడీ అవుతుందట. ప్రొడ్యూసర్లు శోభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇప్పటికే రానా కోసం ఓ స్టోరీని రెడీ చేశారట. దీని భాద్యతలను కొత్త డైరెక్టర్ కిషోర్ కి అప్పగించారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడైనా రావొచ్చు.

ఇలా రానా చేతిలో ప్రస్తుతం హిరణ్యకశి, తలైవర్ 170, ఆర్కా మీడియా నిర్మాణంలో రాబోయే భారీ సినిమా ఉంది. ఈ మూడు సినిమాలను ఎంపిక చేసుకున విధానం చూస్తేనే, రానా తన పాన్ ఇండియా కెరీర్ కోసం ఎలాంటి ప్రయాత్నాలు చేస్తున్నాడో అర్థమవుతుంది.

Read More:Dulquer salmaan comments on rana: రానా పై దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు