Rana’s Next Movie: రానా, తేజ సినిమా అందుకే డిలే..?

రానా హీరోగా తేజ డైరెక్షన్లో ఓ సినిమా రానుందని చాలా కాలం కిందట తేజ అనౌన్స్ చేసాడు. అహింస సినిమా తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందని టాక్ వినిపించింది కానీ, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నవంబర్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది. ఈ సినిమా ఇంత డిలే అవ్వటానికి స్క్రిప్ట్ విషయంలో రానా, తేజ మధ్య డిఫరెన్సెస్ రావటమే కారణమని తెలుస్తోంది. తేజ వినిపించిన స్క్రిప్ట్ లో రానా చాలా చేంజెస్ సజెస్ట్ చేసాడట.ఈ మార్పుల వల్లే ఇంత డిలే అయ్యిందట.
రానా తేజ కాంబినేషన్లో గతంలో నేనే రాజు, నేనే మంత్రి లాంటి హిట్ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. అయితే, ఆ సినిమా తర్వాత తేజకి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేకపోవటం మొన్న అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తీసిన అహింస సినిమా డిజాస్టర్ అవ్వటం తేజ టేకింగ్ మీద అనుమానాన్ని పెంచుతోంది.
అహింస మొగిల్చిన మచ్చను చెరిపేసుకొని తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి. తేజకి హిట్ కంపల్సరీ అయిన పరిస్థితిలో రానున్న ఈ సినిమా ఏ జానర్లో ఉండనుంది, హీరోయిన్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వేచి చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు