Khaidi: 40 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఖైదీ!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక శిఖరం. ఎన్టీ రామారావు తర్వాత తెలుగు సినిమా ఇండీస్ట్రీ ని శాసించిన ఘనుడు. “బిగ్గర్ దెన్ బచ్చన్” గా దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ మహా నటుడు నాలుగు దశాబ్దాలు గా టాలీవుడ్ పై ఏకచక్రాధిపత్యం చేసిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే పెద్దగా మారారు. మెగా స్టార్ అనే ఈ మహావృక్షం నుండే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇండస్ట్రీకి స్టార్లు అయ్యారు.

అలాంటి చిరంజీవిని అభిమానులకి సొంతం చేసిన సినిమా “ఖైదీ”. చిరంజీవి కి మాస్ హీరోగా స్టార్ డమ్ తెచ్చిన ‘ఖైదీ’ మెగాస్టార్ కెరీర్ నే కాదు. తెలుగు సినిమా దశ దిశని కూడా మార్చి కొత్త పుంతలు తొక్కేలా చేసిన సినిమా ఇది. 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా నేటికీ నలభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా ఖైదీ గురించి కొన్ని ముచ్చట్లు.

1978 లోనే చిరంజీవి పరిచయమైనా, ఆయన ఒక స్టార్ గా ఎదగడానికి ఐదేళ్లు పట్టింది.

- Advertisement -

నిజానికి ఖైదీ కథ మొదట వెళ్ళింది చిరంజీవి దగ్గరికి కాదు. సూపర్ స్టార్ కృష్ణ దగ్గరకి. అయితే ఈ కథ కేవలం పగ, ప్రతీకారాలకి సంబంధించింది కావడంతో, అప్పటికే కృష్ణ ఇలాంటి కథలు చేసి ఉండడంతో ఈ కథని రిజెక్ట్ చేసారు. అప్పుడే చిరంజీవి దగ్గరికి ఖైదీ కథ వెళ్ళింది.

అయితే కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగానే ఓపెనింగ్ జరుపుకోవడం విశేషం. మాధవి, సుమలత హీరోయిన్స్ గా, రావుగోపాల్ రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి పది రోజులు పెద్దగా థియేటర్లకు వెళ్ళలేదు జనాలు. కానీ ఆ తర్వాత యూత్ మెల్లిగా సినిమా చూడడం స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో పాటలకి, ఫైట్లకి ఫిదా అయ్యారు. ఒకే మూసధోరణి లో వెళ్తున్న తెలుగు సినిమాని తన డాన్స్, ఫైట్స్ తో ఓ రేంజ్ లో లేపి నిలబెట్టారు. చక్రవర్తి స్వరపరిచిన అన్ని పాటలు కల్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

ఆ రోజుల్లోనే 8.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఖైదీ సినిమా ప్రేమాభిషేకం సినిమా రికార్డులని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక ఈ ఖైదీ లో చిరు ఇంట్రడక్షన్ సీన్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. ఒక సినిమాలో హీరోకి మాస్ ఎలివేషన్ ఎలా ఇవ్వాలో ఈ సినిమా నుండే మొదలైంది. హాలీవుడ్ మూవీ ‘ఫస్ట్ బ్లడ్’ కి ప్రేరణ గా తీసుకుని రాసిన ఈ సీన్ థియేటర్లలో ఫ్యాన్స్ ఊగిపోయేలా చేసింది. ఇక ఖైదీలో చిరంజీవి ఒంటిపైన నాగలి ఎత్తుకుని వ్యవసాయం చేసే సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఖైదీ లో చిరంజీవి “సూర్యం”గా చిరంజీవి నటన, అసామాన్యం. ఇక ఒక్క డైలాగ్ తో ఖైదీ గురించి ఎండ్ చేయాలంటే “పగ తీర్చుకోవడానికే ఈ జన్మెత్తాను” ప్రేమ కోసం మరో జన్మెత్తుతాను”…

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు