Chiranjeevi: 20యేళ్లు పూర్తి చేసుకున్న ఠాగూర్…

Chiranjeevi:

20యేళ్లు పూర్తి చేసుకున్న ఠాగూర్ … చిరంజీవిని రాజకీయాల్లోకి ప్రేరేపించిన సంచలన చిత్రం!

టాలీవుడ్ ని మూడు దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో బెస్ట్ మూవీస్ ఏంటి అంటే చాలా చిత్రాలు చెప్తాము. కానీ అందులో టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా ఖచ్చితంగా నిలిచే సినిమా ‘ఠాగూర్’. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకే కాదు, కామన్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఇన్స్పైరింగ్ చేసే ఈ సినిమా నేటికీ అనగా సెప్టెంబర్ 24 2023 నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు, అన్నిటికి మించి పలు వివాదాలకు కూడా తావిచ్చిన ఈ సినిమా గురించి ఓ లుక్కేద్దాం.

2002 లో ఇంద్ర ఇండస్ట్రీ హిట్ తో కొట్టి మంచి ఊపు మీదున్నారు మెగాస్టార్. ఈ నేపథ్యంలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని సినిమాగా తీద్దామని అనుకున్న తరుణంలో, తమిళ్ లో హిట్ అయిన రమణ మూవీని చూసారు అల్లు అరవింద్. ఈ సినిమా చిరుకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అనుకున్న అరవింద్ ఆ రీమేక్స్ రైట్స్ ని తీసుకున్నారు. అప్పుడే రమణ రైట్స్ కోసం హీరో రాజశేఖర్ కూడా ట్రై చేసారని తెలిసింది. కానీ అప్పటికే రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు అల్లు అరవింద్. కానీ రాజశేఖర్ జీవిత ఈ వివాదాన్ని ఏళ్లుగా లాక్కొచ్చారు.

- Advertisement -

ఏది ఏమైనప్పటికీ రమణ రీమేక్ రైట్స్ తీసుకున్నాక డైరెక్టర్ గా ఎవర్ని ఎంచుకోవాలో అనుకున్న టైములో ఒకసారి, చిరంజీవి దగ్గరికి వచ్చి కథ వినిపించిన వివి. వినాయక్ డైరెక్టర్ గా అయితే బాగుంటాడని ఎన్నుకున్నారు. అయితే క్లైమాక్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్న చిరు, వివి. వినాయక్ ని క్లైమాక్స్ తన స్టయిల్ లో చేంజ్ చేయమని చెప్పగా, పలు మార్పులు, చేర్పులతో సినిమా తెరకెక్కింది.

కేవలం 5నెలల్లో తీసిన ఈ సినిమా మూడు గంటల నిడివితో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సినిమా బ్లాక్ బస్టర్ అని అన్నిచోట్లా స్ప్రెడ్ అయింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవలతో ప్రజలకి చేరువైన చిరంజీవిని, ఠాగూర్ సినిమాతో మరింత దగ్గరకి చేస్తే, వ్యక్తిగతంగా చిరంజీవిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రేరేపించిన సినిమా ఠాగూర్ కావడం విశేషం. అంతకు ముందే ముఠామేస్త్రి సినిమా టైం లో చిరు ని రాజకీయాల్లోకి రమ్మని అభిమానులు రిక్వెస్ట్ చేసినా స్మూత్ గా తప్పించుకున్న చిరు, ఠాగూర్ విజయం తర్వాత తానే పాలిటిక్స్ కి వస్తున్నట్టు హింట్ ఇచ్చేలా చేసింది.

ఇక ఠాగూర్ కథ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల్లోని లంచగొండితనం వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో, ఈ లంచం అనే మహమ్మారి నుండి ప్రజల్ని కాపాడడానికి ఠాగూర్ అనే వ్యక్తి ప్రజలకి తెలియకుండా ఎలాంటి పోరాటం చేసాడనేది ఈ కథ. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రాణం పోస్తే, పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ మరో ఆలోచింపచేశాయి.

2003 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ దిశగా సాగుతున్న తరుణంలో నాగార్జున శివమణి అడ్డుకట్ట వేసింది. ఇక ఠాగూర్ సినిమా అప్పట్లోనే 25.28కోట్ల షేర్ సాధించగా, 253 సెంటర్లలో 50డేస్, 191 సెంటర్లలో 100 డేస్ ఆడింది. ఇక 53 సెంటర్లలో డైరెక్ట్ గా 175 రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఇప్పటికి చాలా ఫేవరేట్.

ఇక ఈ సినిమా లో డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. “తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం” ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందో చెప్పడానికి.

చిరు రీ ఎంట్రీ ఇచ్చాక అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు సైతం ఠాగూర్ లాంటి సినిమా మళ్ళీ చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు