Venky Atluri: హడావిడి లేకుండా స్టార్ట్ అయిన దుల్కర్ సినిమా?

Venky Atluri:

మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నెమ్మదిగా తెలుగు వాడైపోతున్నాడు. మలయాళం స్టార్ అయిన ఈ హీరో డబ్బింగ్ సినిమా ఓకే బంగారం తో పరిచయమైనా, మహానటి సినిమా లో జెమినీగణేశన్ పాత్ర ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సీతారామం సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరవడమే గాకుండా, కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఏకంగా తెలుగు హీరో అయ్యే రేంజ్ లో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఇప్పుడే పట్టాలెక్కింది. ఇన్ని రోజులు కింగ్ అఫ్ కోత సినిమా ప్రమోషన్ లో బిజీ అయిన దుల్కర్, ఇప్పుడు తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టేసాడు. వెంకీ అట్లూరి డైరెక్టర్ గా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు “లక్కీ భాస్కర్” అని టైటిల్ అనుకున్నట్టు ఇంతకు ముందే చెప్పడం జరిగింది.

ఇక ఈరోజు అఫిషియల్ గా హైదరాబాద్ లో పూజ లాంఛనాలతో పెద్దగా హడావిడి లేకుండా సినిమా ఓపెనింగ్ జరుపుకుంది. ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ తో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారం నుండి మొదలవుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా జి.వి. ప్రకాష్ పని చేస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు