Skanda: బాలీవుడ్ లో రామ్ పొతినేని ఫస్ట్ కలిసింది ఏ హీరోనో తెలుసా?

Skanda:

టాలీవుడ్ లో లవ్ స్టోరీస్ ద్వారా ఆకట్టుకుని, ఇప్పుడు మాస్ హీరోగానూ సత్తా చాటేందుకు ఆరాట పడుతున్న లవర్ బాయ్ రామ్ పొతినేని. ఒక మాస్ హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్న ఈ హీరో మాస్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు హిట్ అయినా, వరుస సక్సెస్ లు మాత్రం అందుకోలేదు. లవ్ స్టోరీస్ ద్వారానే సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ఊర మాస్ సినిమా ‘స్కంద’ తో ఆడియన్స్ ని అలరించడానికి సెప్టెంబర్ 28న వస్తున్నాడు.

ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ బాలీవుడ్ లో రామ్ మీట్ అయిన ఫస్ట్ హీరో ఎవరు అనగా, దానికి రామ్ ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. రామ్ మాట్లాడుతూ తాను, బాలీవుడ్ లో కలిసిన ఫస్ట్ స్టార్ హీరో ‘సల్మాన్ ఖాన్’ అని చెప్తూ తనని కలిసిన రోజుని గుర్తు చేసుకున్నాడు. నేను జెనీలియా, తన భర్త రితేష్ దేశముఖ్ మంచి ఫ్రెండ్స్. ఒకసారి నేను తెలుగు సినిమా షూటింగ్ లో ఉంటె, వాళ్ళు తమ హిందీ సినిమా షూటింగ్ లో రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నారు. అప్పుడే వాళ్ళతో ఉన్నప్పుడు, రితేష్ భాయ్ వస్తున్నారు? అన్నారు. ఎప్పుడు నేను వెళ్తాను అంటే, రితేష్ బలవంతంగా ఆపి, నన్ను పరిచయం చేసాడు.

అప్పుడే సల్మాన్ ఖాన్ ని కలవడం జరిగింది. ఆయనకు నన్ను పరిచయం చేసాక గుర్తున్నావ్.. రెడీ ఒరిజినల్ చేసింది నువ్వేగా, చాలా బాగా చేసావ్ అన్నారు. తమ సినిమా సల్మాన్ ఖాన్ రీమేక్ చేయడం చాలా సంతోషమనిపించింది అని రామ్ అన్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు