Pedakaapu: ఆ సినిమాల కలెక్షన్స్ కి గండి పడనుందా?

Pedakaapu:

టాలీవుడ్ లో గత వారం పెద్దగా అంచనాలు లేని సినిమాలు వచ్చినప్పటికీ ఈ వారం మాత్రం మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న ‘స్కంద’ ఒకటి కాగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు’ సినిమా ఒకటి. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న పిక్చర్స్ కావడంతో రెండింటిపైనా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఇవేగాక చంద్రముఖి2, ది వాక్సిన్ వార్ అనే రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిపై ఆడియన్స్ దృష్టిలో పెద్దగా బజ్ లేదు. కానీ సెప్టెంబర్ 28న రాబోతున్న స్కంద, 29న వస్తున్న పెదకాపు పై మినిమం బజ్ ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలకి రిలీజ్ డేట్ భయం పట్టుకుంది. అసలు విషయానికి వస్తే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే టైం లో దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటైన వినాయక చవితి లో భాగమైన నిమజ్జనం వస్తుంది. పండగ అయిన 11వ రోజు అన్ని చోట్ల ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు కాబట్టి, ఆ రోజు దాదాపు జనాలందరూ సెలెబ్రేషన్స్ లో ఉంటారు. కాబట్టి స్కంద, పెదకాపు సినిమాల రిలీజ్ రోజు ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు వెళ్లరు అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.

టాలీవుడ్ సినిమాలకు ఓపెనింగ్సే కీలకం కాబట్టి, ఈ విషయంలో రెండు సినిమాలకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టాక్ బాగుంటే ఓపెనింగ్స్ పై దెబ్బ పడినా, లాంగ్ రన్ లో పికప్ చేసుకోవచ్చు. కానీ టాక్ అటు ఇటు అయినా రెండు సినిమాలకు నష్టం తప్పదు. మరి చూడాలి ఎం జరుగుతుందో?

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు