Megastar: చిరు ని బ్లాక్ మెయిల్ చేసిన చరణ్..!

Megastar:

నట శిఖరం మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్లు, ఇండస్ట్రీ హిట్ లు, రికార్డులు సృష్టించారు చిరంజీవి. ఇక ఆయన ఇండస్ట్రీలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ముఖ్యంగా తన కొడుకు రామ్ చరణ్ విషయంలో అయితే మరింత ఎక్కువ స్ట్రిక్ట్ గానే ఉంటారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి – రామ్ చరణ్ కి సంబంధించిన మరో న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే.. చెర్రీ సినిమాలలోకి రాకముందు అతడి బాడీ ఫిట్నెస్ పై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నటుడు శ్రీహరి వద్దకు ఫిట్నెస్ కోసం పంపించారట. అయితే రెండు రోజులు శ్రీహరి దగ్గరికి బాగానే వెళ్లిన రామ్ చరణ్.. మూడో రోజు మాత్రం ఆయన పెట్టే కఠినమైన రూల్స్ పాటించలేక ఏడుస్తూ ఇంటికి వచ్చేసారట. అంతేకాదు ఆయన దగ్గర నేను ఫిట్నెస్ పాఠాలు నేర్చుకోలేనని చిరంజీవితో తేల్చి చెప్పారట.

బలవంతంగా పంపించాలని చూస్తే చచ్చిపోతానని ఏడుస్తూ మొండి చేశారట. చిరంజీవి ఎంత చెప్పినా సరే వినలేదట. ఇక ఫిట్నెస్ విషయంలో శ్రీహరి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనకు తెలిసిన విషయమే. ఆ కఠినమైన రూల్స్ భరించలేని రామ్ చరణ్ ఇక నేను వెళ్ళనని తెగేసి చెప్పారట. ఆ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ ఫిట్నెస్ కోసం స్వయంగా ఇంటి వద్ద కేర్ తీసుకుని ఓ ఫిట్నెస్ కోచ్ ని అపాయింట్ చేసుకున్నారట. ఇక రామ్ చరణ్ సినిమాలలోకి వచ్చిన తర్వాత మగధీర సినిమాలో రామ్ చరణ్ – శ్రీహరి ఇద్దరూ మగధీర సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు