Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కొత్త రికార్డ్

Vijay Deverakonda

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే విజయ్ వేసుకునే బట్టల వరకు కూడా యూత్ విజయ్ దేవరకొండ ను పిచ్చిగా ఫాలో అవుతుంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో మొదలైన విజయ్ ఫాలోయింగ్ ఆయన సినిమాలు వరుస ఫ్లాప్ అవుతున్న కూడా విజయ్ ఫాలోయింగ్ మాత్రం నానాటికి పెడుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా చూస్తే విజయ్ దేవరకొండ తన ఫాలోయింగ్ తో ఒక కొత్త రికార్డ్ ను కూడా క్రియేట్ చేసాడు.

విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ వల్ల కొంతమంది ఆయనపై నెగిటివ్ రియాక్ట్ అయిన కూడా ఏదో ఒకరకంగా విజయ్ ను ఫాలో అవకుండా మాత్రం ఉండలేరు. విషయానికొస్తే ఇటీవలనే సోషల్ మీడియా యాప్ అయిన వాట్స్ యాప్.. ఛానల్ పేరుతో ఒక కొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఇక ఈ ఫీచర్ లో భాగంగా సెలెబ్రెటీలు మరియు ఇన్ఫ్లు ఎన్సర్స్ , మీడియా చానెల్స్ చాలా మంది ఈ కొత్త ఫీచర్ ను యూస్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు.

ఇటీవలనే విజయ్ దేవరకొండ కూడా వాట్స్ యాప్ ఛానెల్ క్రియేట్ చేసాడు. అయితే విజయ్ వాట్స్ యాప్ లో ఈ ఛానెల్ క్రియేట్ చేసుకున్న అతి తక్కువ సమయంలోనే ఏకంగా 10 లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరో కు కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత మంది ఫాలోవర్స్ ఈ యాప్ ద్వారా రాలేదు. దాంతో అత్యంత తక్కువ టైం లో 1 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న తొలి సౌత్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు విజయ్ దేవరకొండ.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు