Pedakaapu: జాతర సాంగ్ శ్రీకాంత్ అడ్డాల మార్క్..

Pedakaapu:

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పెదకాపు” రోజు రోజుకి అంచనాలను పెంచేస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్ వచ్చినప్పటినుండే ఓ రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ మొదలవగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో పీక్స్ కి చేరింది. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విక్రాంత్ కర్ణ హీరోగా పరిచయమవుతూ ఉండగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల స్వయంగా ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించాడు.

ఇక ఈ సినిమా నుండి తాజాగా జాతర పేరుతో సాంగ్ రిలీజ్ అయింది. పోలేరమ్మ జాతర గా రిలీజ్ అయిన ఆ పాట ఊరి జనాల మధ్య ఏదో సాధించిన సందర్భంలో చేసినట్టు అనిపిస్తుంది. అందరి కళ్ళల్లో భావోద్వేగం తో కూడిన ఎమోషన్ కనిపిస్తుంది. ఇక ఈ పాటను అనురాగ్ కులకర్ణి తనదైన శైలిలో ఆలపించగా, కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. రాజు సుందరం కోరియోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. మిక్కీ జె మేయర్ చాలా రోజుల తరువాత మాస్ ఆల్బం ఇచ్చాడని తెలుస్తుంది.

- Advertisement -

అయితే పాటలో హింసాత్మక సన్నివేశాలను ఎక్కువగా చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఏది ఏమైనా పెద కాపు సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాల ఒక మాస్ కం బ్యాక్ ఇచ్చేలా ఉన్నారు. పెదకాపు చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తుండగా, 28న రిలీజ్ అవుతున్న స్కంద తో పోటీ పడనుంది. మార్కెట్ దృష్ట్యా ఆ సినిమాకే ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా పెదకాపు వైపే జనం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు