Pedakaapu: శ్రీకాంత్ అడ్డాలే ఆ రోల్ లో ఎందుకు నటించాల్సొచ్చింది?

Pedakaapu:

టాలీవుడ్ లో విలక్షణమైన దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాలే తీసినప్పటికి తనదైన స్టయిల్ లో యూత్ ని ఆకట్టుకొనేలా సినిమాలు చేసారు. అయితే బ్రహ్మోత్సవం డిజాస్టర్ శ్రీకాంత్ కి కోలుకోడానికి చాలా టైం పట్టింది. లాక్ డౌన్ తో వెంకటేష్ తో నారప్ప అంటూ రీమేక్ సినిమాతో వచ్చి రచ్చ చేసాడు. నారప్ప ఓటిటిలోనే వచ్చినా కూడా మంచి రెస్పాన్స్ తో దుమ్ము లేపింది. ఇక ఆ సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యే ఇప్పుడు ‘పెద కాపు’ అనే సినిమా డైరెక్ట్ చేసాడు.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. విశేషమేంటంటే ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాలే స్వయంగా విలన్ రోల్ పోషించాడు. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విక్రాంత్ కర్ణ హీరోగా పరిచయమవుతూ ఉండగా, పల్లెటూరి క్యాస్ట్ ఫీలింగ్స్, అధికారాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఎందుకు నటించాల్సి వచ్చిందో ట్రైలర్ లంచ్ ఈవెంట్ లో చెప్పడం జరిగింది.

ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన రోల్ గురించి ప్రస్తావిస్తూ, పెద కాపు లో తన రోల్ కోసం ముందుగా మలయాళ నటుడు శ్రీనాథ్ బాసి ని అనుకున్నాం. అయితే అనుకోని కారణాల వల్ల అతనికి డేట్స్ కుదరక పోవడంతో, వేరే వాళ్ళని కూడా సంప్రదించకుండా, నేనే ఆ రోల్ లో నటించాల్సి వచ్చింది. ఇక పెదకాపు సినిమా సెప్టెంబర్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు