Srikanth addala: ఆ సినిమా ఇంఫ్లుయెన్స్ తోనే పెద్ద కాపు కథ రాసాను- శ్రీకాంత్ అడ్డాల కామెంట్స్

ఇప్పుడున్న టాలీవుడ్ దర్శకులలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ మరియు క్లాస్ సినిమాలు తీసే ఒకే ఒక్క దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా పరిహాయమయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి, శ్రీకాంత్ అడ్డాలకు మంచి పేరును తీసుకొచ్చింది.

ఇక ఆ సినిమా తరువాత వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సున్నితమైన భావోద్వేగాలు, మనసును హత్తుకునే సంభాషణలతో తనదైన మేకింగ్ స్టైల్ తో తెరకెక్కించబడిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను హీరోగా లాంచ్ చేసే అవకాశం అందుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్న ఈయన కెరీర్ మహేష్ బాబు తో చేసిన బ్రహ్మోత్సవం సినిమా ఈ సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. భారీ అంచనాల మధ్య రిలీజైన మహేష్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచి శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను చిక్కుల్లో పడేసింది.

- Advertisement -

దాదాపు ఐయిదేళ్ల పాటు సినిమాలేమి లేకుండా ఖాళీ అయిపోయాడు ఈ డైరెక్టర్. ఇటీవలనే ఈయన వెంకటేష్ తో తమిళ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా నారప్ప సినిమాను తెరకెక్కించాడు. కరోనా కారణంగా ఓటిటిలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరి నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. దాంతో శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ మునుపటిలాగా సినిమాలు చేయడం స్టార్ట్ చేసాడు. అయితే నారప్ప సినిమా చేస్తున్న సమయంలోనే ఆయనకు 1980స్ లో ఒక ఊరు నేపథ్యంలో జరిగే ఒక కథను సినిమాగా చేయాలనే ఐడియా వచ్చిందట. దాంతో వెంటనే ఆ కథ రాయడం ప్రారంభించి ఆ కథనే ప్రస్తుతం పెద్ద కాపు పేరుతో సినిమాగా తీస్తున్నాడు. ఇటీవలనే రిలీజైన ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకోగా ఆగస్టు 18న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలవబోతుంది. మరీ ఈ సినిమాతోనైన శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకులు తనపై కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెచుకుంటాడో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు