Khushi: యాక్టింగ్ కు గుడ్ బాయ్ చెప్పనున్న సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత యాక్టింగ్ గుడ్ బాయ్ చెబుతుందనే వార్త ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే సమంత తీసుకున్న ఈ నిర్ణయంపై ఆమె ఫ్యాన్స్ అంత షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో నటిస్తుంది. అలాగే హిందీలో సిటడెల్ అనే వెబ్ సిరీస్ మరియు తమిళ్ లో చెన్నై స్టోరీ అనే సినిమాల్లో నటిస్తుంది. వీటితో పాటు పలు పెద్ద పెద్ద సినిమాల్లో ప్రధాన పాత్ర నటించడానికి గాను డిస్కషన్స్ జరుగుతున్న ఈ సమయంలో సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతుందనే వార్త వైరల్ అవుతుంది.

ఇప్పటికే తన దగ్గరికి స్టోరీ చెప్పడానికి వస్తున్న ప్రొడ్యూసర్స్ కు, దర్శకులకు తాను సినిమాలు చేయడం లేదని చెప్పేసిందట, దాంతో ఆమె దగ్గరికి వెళ్లిన డైరెక్టర్ లంత తిరిగి వెళ్ళిపోతున్నారని టాక్. అలాగే ఇప్పటివరకు ఆమె కమిట్ అయిన కొన్ని సినిమాల అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేసిందట.

- Advertisement -

దీనికి కారణం ఆమె పర్సనల్ లైఫ్ లో వచ్చిన మార్పులే అన్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్యతో డైవర్స్ తరువాత సమంత ప్రవర్తనలో చాలా వరకు మార్పులు వచ్చిన విషయం అందరికి తెల్సిందే. బయటికి మాత్రం తనకేమీ కాలేదంటూ, సినిమాలతో బిజీగా ఉన్నట్టు హడావిడి చేసిన లోలోపల మాత్రం ఆమె బాధపడుతుందనే విషయం ఇటీవల కాలంలో ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పెడుతున్న ఎమోషనల్ పోస్టులు చూస్తే అర్థమవుతుంది.

మరో పక్క అనారోగ్య సమస్యలతో కూడా ఆమె బాధపడుతుండటంతో ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనుందట. అయితే మళ్ళీ సినిమాలు చేస్తుందో, లేదా ఇకపై అసలు సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుందో తెలియడం లేదు. ఈ విషయంపై సమంత తొందర్లోనే ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా క్లారిటీ ఇవ్వనుందని సమాచారం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు