Kalyan Ram : విడుదలైన డెవిల్ టీజర్- కళ్యాణ్ రామ్ కు హిట్ కన్ఫామ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా వస్తోన్న డెవిల్ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. నవీన్ మేడారం దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. గతంలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగ, సినిమా పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సినిమా రిజల్ట్ ను పట్టించుకోకుండా కమర్షియల్ సినిమాలకన్నా ప్రయోగాత్మక సినిమాలకె పెద్ద పిటా వేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా డెవిల్ మూవీ యూనిట్ ఆయనకు విషెష్ తెలియజేస్తూ ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది.

అయితే ఈ సినిమా కథ భారత దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని తీసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో స్పై సినిమాల ట్రెండ్ నడుస్తుండగా ఈ సినిమా మాత్రం వాటికీ చాలా వరకు బిన్నంగా ఉండబోతుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

- Advertisement -

బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ ల జంట మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సౌందర్య రాజన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా రిలీజ్ అనంతరం కళ్యాణ్ రామ్ బింబిసార పార్ట్ 2 సినిమాని పట్టాలెక్కించనున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు