Mega family: నిహారికపై నెటిజన్ల ఫైర్.. మూడేళ్లకే బోర్ కొట్టిందా.. నిహారిక రియాక్షన్ ?

మెగా డాటర్ నిహారిక కొణిదెల మూడేళ్ళ దాంపత్య జీవితానికి నిన్న సాయంత్రంతో బ్రేక్ పడింది. 2020 డిసెంబర్ 9న వీరిద్దరి పెళ్లి ఉదయపూర్ ప్యాలస్ లో బంధువులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వీరిద్దరి వివాహ వేడుక జరగగా, నిన్న సాయంత్రం హిందూ వివాహచట్టం 1955 ప్రకారం దంపతులిద్దరి పరస్పర అంగీకారంతో కోర్ట్ విడాకులు మంజూరు చేసింది.

గతకొద్ది కాలంగా మనస్పర్థల కారణంగా, దూరంగా ఉంటున్న ఈ జంటపై సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ రూమర్స్ రాగా, మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు అయితే చివరికి ఆ రూమర్ లే నిజం అయ్యాయి. ఇటీవలనే కూకట్ పల్లి ఫామిలీ కోర్ట్ లో నిహారిక, చైతన్య ఇద్దరు డైవర్స్ కు అప్లై చేయగా. నిన్న సాయంత్రం కోర్ట్ వీరిద్దరి అభ్యర్థనను స్వీకరించి విడాకులు సాంక్షన్ చేసింది.

అయితే నిహారిక డైవర్స్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పెళ్లి అయిన మూడేళ్లకే డైవర్స్ తీసుకోవడమేంటి అంటూ, నిహారిక పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భార్య భర్తలన్నాక గొడవలు అవుతుండటం కామనే కానీ ఇలా గొడవ అయిన ప్రతిసారి డైవర్స్ తీసుకుంటే ఇక జీవితాంతం పెళ్లిళ్లు, విడాకులు తీసుకుంటూనే ఉండాలంటూ నెటిజన్లు నిహారిక పర్సనల్ లైఫ్ పై కామెంట్ చేస్తున్నారు. సినిమాల కోసం భర్తను వదిలేయడమేంటని ఆమెని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

దాంతో ఈ కామెంట్స్ పై స్పందించిన నిహారిక ఒక నోట్ ను విడుదల చేసింది. చైతన్య తాను ఒకరికొకరు పరస్పర ఇష్టంతోనే విడాకులు తీసుకున్నామని ఆమె ఈ నోట్ లో రాసుకొచ్చింది. ఈ విషయాన్నీ ఇంకా పెద్దది చేయొద్దంటూ మాకు కొంచెం ప్రైవసి కావాలంటూ,తాను మళ్ళీ సాధారణ జీవితం గడపడానికి అందరి సపోర్ట్ కావాలంటూ ఆమె ఈ నోట్ లో తెలిపింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు