BRO: పవన్ కళ్యాణ్ ఇంత రోల్ కు ! అంత డిమాండా.. ?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తోన్న బ్రో సినిమాకు మార్కెట్ లో భారీ రేట్ పలుకుతుందనే వార్త టి-టౌన్ లో హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ రేటుకు అమ్ముడవబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అసలు బ్రో సినిమా గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోనే కాదు. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో మెయిన్ హీరో, పవన్ కళ్యాణ్ కేవలం ఒక చిన్న క్యారెక్టర్ ,మాత్రమే ప్లే చేస్తున్నారు. అందుకే ఈ సినిమా షూటింగ్ కూడా కేవలం 20 రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ కంప్లిట్ చేసారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన గోపాల గోపాల సినిమాలో నటించిన రోల్ కంటే బ్రో సినిమాలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

కానీ మేకర్స్ మాత్రం ఈ సినిమాని మార్కెట్ చేయలనే ఉద్దేశ్యంతో తెలివిగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో పవన్ కళ్యాణ్ షాట్స్ ఎక్కువగా ఉండేలా టీజర్ కట్ చేయించడంతో, అటు ప్రేక్షకులలో, ఇటు పవన్ ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలు పెరిగాయి.

- Advertisement -

బ్రో సినిమా కథలో గణనీయంగా మార్పులు చేసి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లెన్త్ పెంచారని వార్తలు వస్తుండటంతో ఈ సినిమాకి దాదాపు 100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతుందంట. అయితే ఇది మంచి విషయమే అయినప్పటి ఫ్యాన్స్ ఆశించినట్టు పవన్ కళ్యాణ్ రోల్ సినిమాలో తక్కువ ఉంటె మాత్రం వాళ్ళ ఆగ్రహానికి థియేటర్స్ తగలబడిపోవడం కన్ఫామ్ అని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

ఇక బ్రో సినిమాకు త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తుండగా, సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాష్ వారియర్ సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నటిస్తుండగా జులై 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు