Citadel: సమంత సెకండ్ మ్యారేజ్..అందుకే సినిమాలకు బ్రేక్ ?

శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ నిన్నటితో కంప్లిట్ అయింది. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సిరీస్ సిటడెల్ షూటింగ్ కూడా ఇటీవలనే కంప్లిట్ చేసేసింది. ఈ రెండు ప్రాజెక్ట్ ల తరువాత సమంత తరువాత ఏ సినిమా చేయబోతుందా అంటూ ఆమె అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనున్నట్టు వస్తున్న న్యూస్ ఆమె ఫ్యాన్స్ ను కలవర పెడుతుంది.

అయితే సమంత లాంగ్ బ్రేక్ తీసుకోవడంపై కొంతమంది ఆమెకున్న మాయోటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవాలంటే కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవడం మంచిదని డాక్టర్స్ సలహా ఇవ్వడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటుండగా. మరికొంత మంది మాత్రం సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుందంటూ అందుకే ఈ లాంగ్ బ్రేక్ తీసుకుంటుందని మాట్లాడుకుంటున్నారు

నాగ చైతన్యతో విడాకుల తరువాత నుంచి ఒంటరిగానే ఉంటున్న సమంత తొందర్లోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట. ఆమె చిన్నప్పటి స్నేహితుడైన ఒక వ్యక్తి ప్రస్తుతం బిజినెస్ రంగంలో మంచి పొజిషన్ లో ఉండగా, ఆ వ్యకి సమంతకు రెండో పెళ్లి గురించి ప్రపోజల్ తీసుకురాగా సమంత ఆలోచించుకోడానికి సమయం అడిగిందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

గతంలో ఆమె ఈ విషయంపై తన ఇంస్టాగ్రామ్ ఒక పోస్ట్ కూడా పెట్టింది. కానీ మళ్ళీ ఏమైందో గాని వెంటనే ఆ పోస్ట్ డిలేట్ చేసింది. అయితే గతంలో లాగా హుటాహుటిన నిర్ణయాలు తీసుకోకూడని అనుకున్న సామ్ ఒక ఏడాది సమయం పాటు ఆ వ్యక్తిని అర్థం చేసుకొని, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి అంగీకారం తెలపడానికి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. మరీ ఈ విషయం ఏ మేరకు నిజమో, కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు